07-08-2025 11:40:22 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ మండలంలోని ఇస్లాంపూర్ లో బీజేపీ మహా సంపర్క్ అభియాన్ లో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన ఇంటింటికి బీజేపీ.. ప్రతి గడపకు బూత్ అధ్యక్షుడు" అనే కార్యక్రమాన్ని తూప్రాన్ రూరల్ బీజేపీ మండల అధ్యక్షుడు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, అమలుకాని హామీలు ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను గడప గడపకు వెళ్లి కుటుంబ సభ్యులకు వివరిస్తూ, అదే క్రమంలో కేంద్రములోని మోదీ సర్కారు చేపడుతున్న సంక్షేమ పథకాలను గ్రామస్తులకు స్పష్టంగా వివరించారు. ఇందులో మండల జనరల్ సెక్రటరీ అంబటి మహేష్ యాదవ్, శక్తి కేంద్రం ఇంచార్జ్ కుంట రాజు ముదిరాజ్, నర్రా ప్రశాంత్, ఇస్లాంపూర్ బూత్ అధ్యక్షులు జోడు నవీన్ ముదిరాజ్, ఉదయ్ గౌడ్, దుందిగళ్ళ మధు ముదిరాజ్, గుర్రాల నవీన్ ముదిరాజ్, అంబటి నవీన్ యాదవ్, జోడు రాజు, జోడు సందీప్, అంబటి యాదగిరి, బైడ్ల బిక్షపతి, కుంట రవి, మన్నే స్వామి, తదితరులు పాల్గొన్నారు.