22-12-2025 12:50:19 AM
వనపర్తి టౌన్, డిసెంబర్ 21: జిల్లా న్యాయ సేవ అధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి పట్టణంలో, ఆత్మకూరు కోర్టులో లోక్ అదాలత్ నిర్వహించడం జరిగినది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవధికార సంస్థ చైర్ పర్సన్ ఎం.ఆర్ సునీత మాట్లాడుతూ జిల్లాలో వివిధ కోర్టులలో పెండింగ్ లో ఉన్న కేసులు 1701 మరియు ప్రీ లిటిగేషన్ కేసులు 8268 మొత్తం 9969 కేసులు పరిష్కారమయ్యాయని తెలియజేశారు.
కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి వి రజని, సీనియర్ సివిల్ జడ్జ్ జి కలర్చన, అడిషనల్ సీనియర్ సివిల్ జడ్జ్ కే కవిత, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జ్ టి కార్తీక్ రెడ్డి, ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ బి శ్రీలత, సెకండ్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జ్ ఎన్. అశ్విని, డిప్యూటీ సూపర్డెంట్ ఆఫ్ పోలీస్ వెంకటేశ్వర్లు, సీనియర్ న్యాయవాదులు, న్యాయవాదులు పాల్గొన్నారు.