22-12-2025 12:50:08 AM
మర్రిగూడ, డిసెంబర్ 21(విజయక్రాంతి): ఇటీవల జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో యరగండ్లపల్లి గ్రామంలో టిఆర్‌ఎస్ బలపరిచిన అభ్యర్థి సర్పంచిగా 627 ఓట్ల భారీ మెజారిటీ తో గెలుపొందిన సర్పంచ్ వల్లంల సంతోష్ యాదవ్ తో పాటు వార్డ్ మెంబెర్స్ గా అత్యంత మెజారిటీ తో గెలుపొందిన వార్డ్ సభ్యులను ఆదివారం మునుగోడు మాజీ ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి హైద్రాబాద్ లోని తన నివాసం లో శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు.
ఊరిలో వీధి దీపాలు,మంచి నీరు,పారిశుద్యం విషయంలో గ్రామంలో ఎప్పుడు కూడా ఇబ్బంది లేకుండా చూసుకోవాలని చెప్పారు. గ్రామ ప్రజలకు ఎల్లప్పు డూ అందుబాటులో ఉండాలని మన పార్టీ పక్క పార్టీ అనుకోకుండా ఆపద వచ్చిన ప్రతి ఒక్కరిని మన కుటుంబ సభ్యులు గానే భావించి ఆదుకోవాలని వారి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ , వార్డ్ సబ్యులకు దిశా నిర్దేశం చేశారు.
ఈ కార్యక్రమంలో ఎరగండ్లపల్లి గ్రామ శాఖ అధ్యక్షులు ముద్దం శ్రీనివాస్ గౌడ్, ,మాల్ మార్కెట్ కమిటీమాజీ చైర్మన్ దంటు జగదీశ్వర్, పార్టీ సీని యర్ నాయకులు వనపర్తి వెంకటయ్య, ముత్యం రెడ్డి ,వనపర్తి నర్సింహా, సేగోజు నర్సింహా చారీ,గుంటోజు శ్రీనివాసా చారి, కోడిచెర్ల అంజయ్య, ఉప్పునూతుల మల్లేష్, కట్ల యాదయ్య, పార్టీ కార్యకర్తలు అయితగొని అంజయ్య,నారోజు అనిల్ చారీ, ఈడా గోని శ్రీను, క్రిష్ణ, వడ్డేపల్లి గణేష్, గిరి, సూరు అబ్బయ్య కార్యకర్తలు పాల్గొన్నారు.