calender_icon.png 12 July, 2025 | 2:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఉత్తమ విద్యార్థులకు నగదు పురస్కారం

12-07-2025 01:48:17 AM

రామచంద్రాపురం, జూలై 11 : ప్రభుత్వ పాఠశాలలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు నగదు పురస్కారం అందజేశారు. రామచంద్రపురంలోని గీత భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేయగా ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ శాసన సభ మాజీ ప్రోటెం చైర్మన్ వి.భూపాల్ రెడ్డి, పటాన్చెరు నియోజకవర్గ బీఆర్‌ఎస్ పార్టీ కోఆర్డినేటర్ ఆదర్శ్ రెడ్డి  హాజరయ్యారు.

ఈ సందర్భంగా మండల పరిధిలోని 8 ప్రభుత్వ పాఠశాలల్లో 10వ తరగతిలో అత్యుత్తమ మార్కులు సాధించిన విద్యార్థులకు సుమారు రూ.91,000,  తెల్లాపూర్ కు 60వేల రూపాయల విలువైన నగదు బహుమతులు ప్రకటించారు. అలాగే గీత భూపాల్ రెడ్డి ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని ప్రతి బ్రాంచ్ నుండి ముగ్గురు ఉత్తమ విద్యార్థులకు మొత్తం రూ.48,000 విలువైన నగదును  ప్రిన్సిపాల్ వెంకట్ రెడ్డికి అందజేశారు.

ఈ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎంఈఆవో రాథోడ్కు అందజేశారు. ఈ కార్యక్రమంలో రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, మాజీ గ్రంథాలయ చైర్మన్ కుమార్ గౌడ్, విష్ణు వర్ధన్ రెడ్డి, బీఆర్‌ఎస్వీ కోఆర్డినేటర్ చిన్నపాల్గొన్నారు.