calender_icon.png 12 July, 2025 | 4:46 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పైపు లైన్ కనెక్షన్ ఇచ్చిన అధికారులు

12-07-2025 01:48:24 AM

‘పైపులైన్ వేశారు.. కనెక్షన్ మరిచారు’ 

కరీంనగర్, జూలై 11 (విజయ క్రాంతి): పైపులైన్ వేశారు.. కనెక్షన్ మరిచారు.. అని విజయక్రాంతి దినప్రతికలో ఈ నెల 9న ప్రచురితమైన వార్తకు స్పందన లభించింది. మంచినీటి సరఫరా కోసం పైపులైన్ వేసి కాంట్రాక్టర్ కనెక్షన్ ఇవ్వకపోడంతో రెండు నెలలుగా నీటి సరఫరా నిలిచిపోయి తీగలగుట్టపల్లి విద్యారణ్య పురికాలనీవాసులు ఇబ్బందులు పడుతున్నారని వార్తను ప్రచురించగా, స్పందించి అధికారులు పైపులైన్ కనెక్షన్ ఇచ్చారు. దీంతో సమస్య పరిష్కారమై ఇబ్బందులు తొలగడంతో విద్యారణ్య పురి కాలనీవాసులు విజయక్రాంతికి కృతజ్ఞతలు తెలిపారు.