30-09-2025 12:00:00 AM
సింగరేణి ఉద్యోగులకు యాజమాన్యం దసరాకు ముందే పండుగ అడ్వాన్స్, లాభాల వాటా, పీఎల్‌ఆర్ (దీపావళి) బోనస్ ప్రకటించి కార్మికుల కుటుంబాల్లో జోష్ నింపింది. ఇలాంటి ఆర్థిక ప్రయోజనాలు విశ్రాంత ఉద్యోగులు గతంలో అనుభవించినవే. అయితే ఇప్పుడు విశ్రాంత ఉద్యోగులు చాలీ చాలని పెన్షన్‌తో బతుకు వెళ్లదీస్తున్నారు. దసరా పండుగను విశ్రాంత ఉద్యోగులు కూడా ఆనందంగా జరుపుకోవాలని భావిస్తుంటారు.
పండుగ కా వడంతో బ్యాంకులకు వరుస సెలవులు ఉండే అవకాశముంది. దీం తో బ్యాంకులు సీఎంపీఎఫ్ ద్వారా చెల్లించే పెన్షన్ బ్యాంక్ ఖా తాల్లో జమ చేసే అవకాశాలు లేకపోవచ్చు. కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లకు ఈ నెల 26న పెన్షన్ చెల్లించింది. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధీనంలో ఉన్న కోల్ మైన్స్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ వారు మాత్రం ప్రతి నెల ఒకటో తేదీన లేదా రెండవ తేదీన బొగ్గు వి శ్రాంత ఉద్యోగులకు పెన్షన్ జమ చేయడం పరిపాటి.
ఈ సారి మా త్రం దసరా రావడంతో సింగరేణి విశ్రాంత ఉద్యోగులు పండుగ పూట పస్తులు ఉంచకుండా అక్టోబర్ ఒకటో తేదీ కన్నా ముందే ముందస్తుగా పెన్షన్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. రిటైర్డ్ ఉద్యోగు ల పట్ల మానవతా దృక్పథంతో ఆలోచించి కోల్ ఇండియా, సింగరేణి, కోల్ మైన్స్ ప్రావిడెంట్ అధికారులతో కార్మిక సంఘాల నాయకులు చర్చించాల్సిన అవసరముంది.
వేణు మాధవ్, హైదరాబాద్