30-09-2025 12:00:00 AM
సుంకవల్లి సత్తిరాజు :
ఈ పరిస్థితులను ఇలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏరికోరి ఆహ్వానించడమే అవుతుంది. శాంతి భద్రతలు కరువైతే యుద్ధోన్మాదం విలయతాండవం చేయక తప్పదు. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, పలు దేశాల మధ్య జరుగుతున్న సంఘర్షణలు ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
ఇటీవలి కాలంలో ప్రపంచంలో అ శాంతి పడగవిప్పి బుసలు కొడుతున్నది. గాజాలో రక్తపాతమైనా,- ఇజ్రాయి ల్-హమాస్‌ల పోరాటమైనా, ఇరాన్‌పై అమెరికా, -ఇజ్రాయిల్ దాడులైనా, భారత్‌లోని పహల్గాంలో పాక్ ఉగ్రవాదులు సాగించిన నరమేథమైనా, రష్యా-, ఉక్రెయిన్ దేశాల మధ్య సంవత్సరాల తరబడి కొనసాగుతున్న భీకర యుద్ధం ఇలా ఏదీ తీసుకున్నా ప్రపంచంలో అశాంతి పవనాలు వీచేలా చేస్తున్నాయి.
అమెరికా అ ధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన లక్ష్య సాధన కోసం ప్రపంచ దేశాలపై అధిక సుంకాలు విధించి ట్రేడ్ వార్‌కు తెర తీశారు. నేపాల్ వంటి దేశాలు ప్రజాగ్రహజ్వాలల్లో చిక్కుకున్నాయి. గతంలో శ్రీలంక, బంగ్లాదేశ్ వంటి దేశాల్లో ప్రజల తిరుగుబాటుతో ప్రభుత్వాలే పతనమయ్యాయి. ఈ దెబ్బకు ప్రపంచంలో పలు దేశాలు ఆర్ధికంగా చితికిపోయాయి. ఒక వైపు యుద్ధాలతో.. మ రో వైపు అగ్రరాజ్యాల ఆధిపత్య ధోరణులతో ప్రపంచ శాంతికి తీవ్ర విఘాతం కలు గుతున్నది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ బెదిరింపుల పర్వం.. భారత్‌కు చైనాను దగ్గరయ్యేలా చేసింది. మూడు బలమైన దేశాలైన భారత్, రష్యా, చైనాలు ఏకమైతే అమెరికాకు దీర్ఘకాలంలో ఎదురయ్యే సమస్యల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. బ్రిక్స్ దేశాల బలోపేతం ఏక ధృవ ప్రపంచ విచ్ఛిన్నానికి మార్గం సుగమం చేస్తుంది. ట్రంప్ విధిస్తున్న టారిఫ్‌ల వల్ల ప్రపంచ వాణిజ్య రంగం అతలాకుతలం కావడమే కాకుండా ట్రేడ్ వార్ వల్ల వివిధ దేశాల మధ్య సం బంధాలు దెబ్బతింటున్నాయి. ఇటీవల ఖతార్‌పై ఇజ్రాయిల్ ఆకస్మికంగా వైమానిక దాడులు జరపడం ఆశ్చర్యం కలి గించింది. దీంతో వర్తమాన ప్రపంచం అశాంతికి నిలయంలా మారిపోయింది.
యుద్ధాలతో నరకయాతన
ఈ పరిస్థితులను ఇలాగే వదిలేస్తే మూడో ప్రపంచ యుద్ధాన్ని ఏరికోరి ఆ హ్వానించడమే అవుతుంది. శాంతి భద్రతలు కరువైతే యుద్ధోన్మాదం విలయతాం డవం చేయక తప్పదు. ఎక్కడైతే శాంతి సుస్థిరతలకు భంగం వాటిల్లుతుందో, అక్క డ అభివృద్ధి కుంటుపడుతుంది. ఇప్పటి వరకు జరిగిన యుద్ధాలు, పలుదేశాల మధ్య సంఘర్షణలు ఈ విషయాన్ని స్ప ష్టంగా తెలియజేసున్నాయి. ప్రపంచంలోని ఇప్పటికీ చాలా దేశాల్లో ప్రజలు జీవించడానికి కనీస మౌలిక సదుపాయాలు లేవు. ఆకలి, దరిద్రం, నిరుద్యోగం, నిరక్షరాస్యత, అవినీతి వంటి పలు అంశాలు ప్రజలను పట్టి పీడిస్తున్నాయి. మూలిగే నక్కపై తాటి పండు పడిన చందంగా సామ్రాజ్య విస్తరణ కోసం వివిధ దేశాల మధ్య జరిగే యు ద్ధాల వలన ప్రజలు నరకయాతన అనుభవిస్తున్నారు. ఇక భా రతదేశం కూడా అనేక దండయాత్రలకు గురైంది. స్వాతంత్య్రానంతరం కూడా చై నా, పాకిస్తాన్ దేశాలతో భారతదేశం అనేక ఇబ్బందులకు గురికావడం చూస్తునే ఉన్నాం. భారతదేశం ప్ర పంచంలో అత్యధిక జనాభా గల ప్రజాస్వామ్య దేశం. అణ్వస్త్ర సామర్ధ్యం కలిగిన బాధ్యతాయుతమైన దేశం. ప్రపంచ దేశాలతో వి స్తృ తమైన వాణిజ్య సంబంధాలు కలిగి, 4.19 ట్రిలియన్ డాలర్లతో నాల్గవ బలమైన ఆర్థిక వ్యవస్థగా అవతరించిన భారత్‌కు ఇతర దేశాల సమస్యలను పరిష్కరించగల నేర్పు, ఓర్పు ఉన్నాయి. అం దుకే రష్యా, ఉక్రెయిన్ల మధ్య యుద్ధాన్ని నిలువరించడానికి భారత్ మధ్యవర్తిత్వం వహించాలని కొన్ని ప్రపంచ దేశాలు భావిస్తున్నాయి. రష్యా చమురును కొనుగోలు చేసే దేశాల్లో భారత్ ముందు వరుసలో ఉంది. అందువల్లే రష్యా-, ఉక్రెయిన్ల మధ్య యుద్ద విరమణకు మన దేశం పూర్తి స్దాయిలో చొరవ తీసుకునే అవకాశం ఉండడం లేదు.
శక్తిమంతంగా భారత్
రష్యా వద్ద భారత్ చమురు కొనుగోలు చేయడమే ఉక్రెయిన్-, రష్యాల మధ్య యుద్ద విరమణ జరగకపోవడానికి కారణమని ట్రంప్ చేస్తున్న వ్యాఖ్యలు అర్ధ రహితం. నోబెల్ శాంతి బహుమతి కోసం ఆరాటపడుతున్న రష్యా-, ఉక్రెయిన్ యుద్ధం విషయంలో మాత్రం ఏం చేయలేకపోతున్నారు. అయితే ఈ ఏడాది చి వర్లో లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ర ష్యా, ఉక్రెయిన్ యుద్ధానికి చరమగీతం పా డే అవకాశముంది. ఇదే గనుక జరిగితే ప్ర పంచం ఒక గండం నుంచి బయటపడిన ట్లే. ఇక భారత్ భవిష్యత్తులో ప్రపంచంలో శాంతి స్థాపన విషయంలో కీలక భూమిక పోషించే అవకాశముంది. పాలస్తీనా విషయంలో భారత్ తన విదేశాంగ విధానం మార్చుకుని ఇజ్రాయిల్‌కు మద్దతు పలకడాన్ని పలు రాజకీయ పక్షాలు ఇప్పటి వ రకు విమర్శించాయి. అయితే గాజాపై ఇ జ్రాయిల్ జరుపుతున్న దాడులకు వ్యతిరేకంగా, పాలస్తీనాకు మద్దతుగా ఇటీవల ఐ క్యరాజ్య సమితిలో భారత్ ఓటు వేయడం గమనార్హం. భారత్ శాంతి కాముక దేశమ ని ఈ పరిణామం నిరూపించింది. ప్ర పంచ వ్యాప్తంగా భారత్‌కు పెరుగుతున్న ఆ దరణ దృష్ట్యా.. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారత్‌కు వీటో హక్కు దక్కాల్సిన అవసరముంది. ఐక్యరాజ్య సమితి ఆ విర్భావ సమయంలో 51 దేశాలకు సభ్యత్వముంటే ఇప్పుడా సంఖ్య 193కు పె రిగింది. భద్రతా మండలిలో 15 సభ్య దేశాలుంటే.. వీటిలో అమెరికా, రష్యా, చైనా, ఫ్రాన్స్, బ్రిటన్‌లు శాశ్వత సభ్య దేశాలుగా అధికారం చెలాయిస్తుండడంతో ఐక్యరాజ్యసమితి ప్రేక్షక పాత్రలా మారిపోయింది. ప్రపంచంలో శాంతి స్థాపనే ధ్యేయంగా ఉ న్నత ఆశయాలతో ఏర్పడిన ఐరాస సంస్థ ఇలా నిస్తేజంగా మారడం ఘోరవైఫల్యం కింద లెక్కకట్టొచ్చు. బంగ్లాదేశ్‌లో ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికైన హసీనా ప్ర భుత్వాన్ని కూల్చినప్పుడు ప్రపంచ దేశాల ను శాసిస్తున్న పెద్దరికం ఎక్కడికి పో యింది? గాజా విషయంలో ఐక్యరాజ్యసమితి పాత్ర ఎంత? దశాబ్దాల తరబడి భా రత్ పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాదంతో యుద్ధం చేస్తున్నా మౌనంగా ఉండడంపై ఐరాస సమాధానం చెప్పాల్సిందే. ప్రస్తుత ప్రపంచ పోకడలు అత్యంత ప్రమాదకరంగా తయారయ్యాయి. ఈ నేపథ్యంలో ప్రపంచ సమస్యల పరిష్కారం విషయంలో భారత్‌కు తగిన ప్రాధాన్యత ఇ వ్వాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న వి షయం తెలుసుకోవాలి.
వ్యాసకర్త సెల్: 9704903463