calender_icon.png 17 September, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తెలంగాణ సాంస్కృతిక శాఖలో కుల వివక్ష

17-09-2025 02:38:45 AM

  1. ప్రస్తుత డైరెక్టర్‌ని మార్చి ఐఏఎస్ అధికారిని నియమించాలి

తెలంగాణ జానపద కళాకారుల ఐక్య వేదిక డిమాండ్

ఖైరతాబాద్; సెప్టెంబర్ 16 (విజయక్రాంతి):  రాష్ట్ర బాషా సాంస్కృతి శాఖ శాఖ కులవివక్షతో నిండుకున్నదని తెలంగాణ జానపద కళాకారుల ఐక్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు మహాంకాళి శ్రవణ్ కుమా ర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గడ్డం హిమగిరి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కనక సుదర్శన్ తెలిపారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్ క్లబ్‌లో వారు మాట్లాడుతూ..

తెలంగాణ లో 66 కళారూపాలు ఉన్నా భాషా, సాంస్కృతిక శాఖ డైరెక్టర్ మామిడి హరికృష్ణ వ్యవహారంతో అన్ని కళారూపాలు అంతరించిపోయేలా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పెన్షన్లు, ప్లాట్లు అడిగినందుకే గుస్సాడీ నృత్య కళాకారుడు పద్మశ్రీ గ్రహీత కనకరాజును డైరెక్టర్ అవమానించారని తెలిపారు. కళాకారులకు సమన్యాయం దక్కాలంటే డైరెక్టర్ హరికృష్ణను బదిలీ చేసి, ఐఎఎస్ అధికారిని నియమించాలని కోరారు.