17-09-2025 02:37:03 AM
విమోచన దినాన్ని పాఠ్యపుస్తకాలలో చెప్పాలి
మాజీ గవర్నర్ విద్యా సాగర్‌రావు
సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలు
ముషీరాబాద్, సెప్టెంబర్, 16 (విజయక్రాంతి): సెప్టెంబర్ 17 హైదరాబాద్ విమో చన దినోత్సవం చారిత్రత్మకమైందని ఇంటిం ట ప్రతి ఒక్కరూ ఈ దినోత్సవాన్ని ఉత్సవంగా జరుపుకోవాలని హర్యానా మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పిలుపునిచ్చారు. మంగళవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ ఆధ్వర్యంలో హైదరాబాద్ విమోచన దినోత్సవంపై పాడూరి కరుణ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది.
ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ... 1947 ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవం రోజున హైదరాబాద్ లో జాతీయ జెండాను కూడా ఎగురవేయ లేదని అన్నారు. సర్ధార్ వల్లాభాయ్ పటేల్ నిజాం సంస్థానాన్ని విలీనం చేశారన్నారు. తెలంగాణ ప్రజలు బానిసత్వం నుంచి బయటకి వచ్చింది సెప్టెంబర్ 17న అని కాబట్టి ఈ రోజును విమోచన దినోత్సవంగా బావించాలన్నారు. మహారాష్ట్ర మాజీ గవర్నర్ సిహెచ్ విద్యా సాగర్ రావు మాట్లాడుతూ..
నిజాం అరాచకాలు చెప్పాలంటే గంటలు కూడా చాలవన్నారు. జరిగిన నష్టాన్ని పూడ్చుకోలేమని అయితే బలహీన వర్గాల ప్రజలను ఆదుకోవాలనే విషయాన్ని ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో బీసీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ వకులభరణం కృష్ణమోహన్ రావు, మాజీ విసీ ప్రొఫెసర్ తిరుపతిరావు ప్రొఫెసర్ మురళి మనోహర్, ప్రొఫెసర్ కసిరెడ్డి వెంకట్ రెడ్డి, బీజేపీనాయకులు డాక్టర్ మనోహర్ రెడ్డి, స్వాతంత్ర సమర యోధుడు విట్టల్ రావు ఆర్య, పాశం యాదగిరి, జాతీయ సాఫాయి కర్మచారి కమిషన్ మాజీ సభ్యులు చింత సాంబ మూర్తి. జర్నలిస్ట్ కప్పర ప్రసాద్, ఉప్పల శారద పాల్గొన్నారు.