17-09-2025 02:40:20 AM
హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 16 (విజయక్రాంతి): తెలంగాణలో ప్రజాస్వామ్య పునాదులకు నాంది పలికిన చారిత్రక ఘట్టం సెప్టెంబర్ 17 అని, ఆరోజు కేవలం రాజ్యాధికారం మార్పు కాదు, ప్రజల చేతిలో ప్రజాస్వామ్యం శక్తి ఆరంభమైన రోజు అని తెలంగాణ డీఎన్‌టీ లాయర్స్ ఫో రం అధ్యక్షుడు సత్యనారాయణ గుండ్లపల్లి అన్నారు. చరిత్రలో ఒక మలుపు- ఆపరేషన్ పోలో అని చెప్పారు.
“1948 సెప్టెంబర్ 17న హైదరాబాద్ సంస్థానం భారత గణతంత్రంలో కలిసింది. దాదాపు రెండు శతా బ్దాలుగా కొనసాగిన నిజాం పాలన ముగిసి, తెలంగాణ ప్రజలకు కొత్త యు గం ఆరంభమైంది. ఆ రోజు నుంచి పల్లెలు, ఊర్లు, పట్టణాలు ప్రజాస్వామ్య పంథాలో అడుగులు వేశాయి. దీన్ని కొం దరు విలీనం అం టారు. మరికొందరు విమోచనం అంటారు. కానీ తెలంగాణ ప్రజల దృష్టిలో ఇది అంతకంటే గొప్పది.
ఇది ప్రజాస్వామ్యానికి నాంది పలికిన రోజు. అందుకే దీనిని ప్రజా పాలన దినోత్సవంగా పిలుస్తున్నారు. స్వాతంత్య్రం తర్వాత హైదరాబాద్‌ను భారత గణతంత్రంలో కలపడానికి కేంద్రం లో కాంగ్రెస్ తీసుకున్న ధైర్య నిర్ణ యం చరిత్రలో చిరస్థాయిగా నిలిచింది. ఆ ప్రయత్నాల వల్లే ఈ రోజు తెలంగాణ ప్రజాస్వామ్య పథంలో దూసుకుపోతోంది. ప్రజా పాలన అన్న పదంలోనే ఆత్మగౌరవం, స్వేచ్ఛ, సమానత్వం దాగి ఉన్నాయి.
కులం, మతం, వర్గం అనే భేదాలు లేకుండా ప్రజలకు హక్కులు లభించిన రోజు ఇది. సెప్టెం బర్ 17 కేవలం చారిత్రక స్మరణ మాత్రమే కాదు, ప్రస్తుత తరం కోసం ఒక గొప్ప పాఠం. ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయ డం మనందరి బాధ్యత అని గుర్తు చేసే రోజు. రాజకీయాలు అధికారానికి మాత్రమే కాదని, ప్రజల సేవకు అని తెలిపే రోజు. తెలంగాణ అభివృద్ధి, సమాన హక్కులు,
సామాజిక న్యాయం ఇవి ప్రజా పాలన బలపడినప్పుడే సాధ్యమని చెప్పే రోజు. సెప్టెంబర్ 17ను విమోచన దినోత్సవం అని పిలవడం విభజనాత్మకంగా మారే ప్రమాదం ఉంది. విలీన దినోత్సవం అని పిలవడం ఆ ఘట్టం యొక్క ఆత్మను పూర్తిగా ప్రతిబింబించదు. కానీ ప్రజా పాలన దినోత్సవం అన్న పేరు మాత్రమే తెలంగాణ చరిత్రకు, ప్రజాస్వామ్యానికి న్యాయం చేస్తుంది” అని అన్నారు