calender_icon.png 21 September, 2025 | 3:04 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రశాంత్ నగర్ లో సి అండ్ సి కొత్త బ్రాంచ్ ప్రారంభం

21-09-2025 12:46:50 AM

హనుమకొండ,(విజయక్రాంతి): వ్యాపార రంగంలో ఉన్నత అభివృద్ధి చెందాలనే దృక్పథంతో, యువ వ్యాపారవేత్తలు దీపక్, శివ, తేజ అనే యువకులు  నయీమ్ నగర్ లోని వరంగల్ స్టోర్ ను అభివృద్ధి చేసిన విధంగా దానికి అనుబంధంగా  ప్రశాంత్ నగర్ లో శనివారం కొత్త బ్రాంచ్ ను ప్రారంభించారు. ఈ ప్రారంభోత్సవం కార్యక్రమానికి వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి అల్లుడు విష్ణువర్ధన్ రెడ్డి హాజరై రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం విష్ణువర్ధన్ రెడ్డి మాట్లాడుతూ యువకులు వ్యాపార రంగంలో అభివృద్ధి సాధించాలని, ఉన్నతమైన విలువలతో వృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అనంతరం సి అండ్ సి షోరూం యజమానులు విష్ణువర్ధన్ రెడ్డిని శాలువాతో ఘనంగా సన్మానించారు.