22-07-2025 12:20:47 AM
హైదరాబాద్, జూలై 21 (విజయక్రాంతి): పాఠశాలల్లో భద్రతను మరింతగా బలోపే తం చేసేలా సీబీఎస్‌ఈ (సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్) కీలక నిర్ణయం తీసుకుంది. అన్ని పాఠశాలల్లో హై రిజల్యూష న్‌తో కూడిన సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేయాలని ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
గత నిబంధనను సవరిస్తూ తన బోర్డు పరిధిలోని అన్ని సీబీఎస్‌ఈ పాఠశాలలకు బోర్డు కార్యదర్శి హిమాన్షు గుప్తా లేఖ తాజా గా రాశారు. పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల భద్రతతో పాటు సర్వులైన్స్ మౌలి క వసతులను బలోపేతం చేయడంలో భాగంగా ఈ చర్యలు చేపట్టినట్లు ఆయన తెలిపారు.
15 రోజుల ఫుటేజీ
పాఠశాలల్లోని ప్రవేశ, నిష్ర్కమణ మార్గా లు, లాబీలు, కారిడార్లు, మెట్లు, తరగతి గదులు, ప్రయోగశాలలు, లైబ్రరీ, క్యాంటీన్ ప్రాంతం, స్టోర్ రూమ్, ఆట స్థలాల్లో వీటిని ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు. అలాగే గోప్యతను దృష్టిలో ఉంచుకొని టాయిలెట్లు, వాష్‌రూమ్‌ల వద్ద సీసీటీవీ కెమెరాల ఏర్పాటుకు మినహాయింపును కల్పించినట్లు లేఖలో తెలిపారు.
అయితే ఈ సీసీటీవీ కెమెరాలు ఆడియో విజువల్ సౌకర్యంతో ఉండాలని సూచించారు. రియల్ టైమ్ ఆడియో- విజువల్ రికార్డింగ్‌తో కనీసం 15 రోజుల ఫుటేజీని నిల్వ చేయగల సామర్థ్యంతో కల్గినవి ఉండాలని తెలిపారు. అవసరమైన సంబంధిత అధికారులు 15 రోజుల బ్యాకప్‌ని యాక్సెస్ చేయగలిగేలా ఉండాలని ఆయన పేర్కొన్నారు.