calender_icon.png 22 July, 2025 | 4:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నాయకులు వాడే భాష ఘోరం

22-07-2025 12:19:46 AM

- రాజ్యాంగ పదవులను గౌరవించాలి

- పథకాల కోసం ప్రజలు ఎదురు చూడొద్దు

- శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి

నల్లగొండ టౌన్, జూలై 21: రాష్ట్రంలో అధికార, ప్రతిపక్ష రాజకీయ నాయకులు వాడే భాష చాలా ఘోరంగా ఉన్నదని, భాషను వాడి ప్రజల ఈసడింపునకు గురి కావొద్దని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి అన్నారు. రాజ్యాంగ పదవులను గౌరవిం చాల్సిన బాధ్యత అందరిపైనా ఉందని తెలిపారు. ఎమ్మెల్సీలు తీన్మార్ మల్లన్న, కల్వకుం ట్ల కవిత ఫిర్యాదులు తనకు అందాయని వారి వ్యవహారం తనను బాధించింద న్నారు. చట్టపరంగా తన కర్తవ్యాన్ని నిర్వహిస్తానని తెలిపారు.

సోమవారం నల్లగొండ జిల్లా కేంద్రంలోని తన క్యాంపు కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఎన్నికలలో వేల కోట్లు డబ్బులు ఖర్చుపెడుతున్నారని దీంతో అన్ని రాష్ట్రాల్లో అవినీతి పెరిగిపోతుందని పేర్కొన్నారు. రాజకీయ పార్టీల వైఖరితో అధికారుల్లో అవినీతి పెరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం, సుప్రీం కోర్టు, కేంద్రం అవినీతిపై దృష్టి సారించి ఎన్నికల్లో ఖర్చు చేసే విషయంలో కఠిన నిర్ణయం తీసుకోవాలని సూచించారు.

పథకాల కోసం ప్రభుత్వం వైపు ప్రజలు ఎదురుచూసే పరిస్థితి ఉండొద్దని, ఉచితాలు తగ్గించి ప్రజలకు ఉపాధి కల్పించాలని చెప్పారు. నాగార్జునసాగర్ ఆయకట్టుకు ముందుగానే నీటి విడుదల చేయడం శుభపరిణామని రాష్ట్ర ముఖ్యమంత్రి, ఇరిగేషన్ శాఖ ఉత్తమ్ కుమార్‌రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో మద్రాస్‌కు నీళ్లు తీసుకుపోవడానికి ప్రాజెక్ట్‌ల అనుసంధానం జరిగిందని ఇచ్చంపల్లి నుంచి నాగార్జున సాగర్‌కు నీళ్లు వస్తే తెలంగాణకు మేలు జరుగుతుందని చెప్పారు.