calender_icon.png 8 July, 2025 | 5:50 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సింగరేణి మనుగడ కోసం దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయండి

07-07-2025 10:58:27 PM

జేఏసీ నాయకుల పిలుపు..

జే.వి.ఆర్ ఓసి, కిష్టారం ఓసి, జే.వి.ఆర్ సి.హెచ్.పి లో గెట్ మీటింగ్..

కొత్తగూడెం (విజయక్రాంతి): కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జులై 9న జరిగే సమ్మెను జయప్రదం చేయాలని జేఏసీ నాయకులు పిలుపునిచ్చారు. సోమవారం సత్తుపల్లి జే.వి.ఆర్ ఓసి, కిష్టారం ఓసి, జే.వి.ఆర్ సి.హెచ్.పి లలో జరిగిన సమావేశంలో ఏఐటీయూసీ, ఐఎన్టియూసి, సిఐటియు, టిబిజికెఎస్ నాయకులు హాజరైయ్యారు. జే.వి.ఆర్ ఓసి, కిష్టారం ఓసి, జే.వి.ఆర్ సి.హెచ్.పి ఐఎన్టియూసి పిట్ కార్యదర్శిలు రామారావు, బాలాజీ, నాగేశ్వరరావుల అధ్యక్షతన జరిగిన జేఏసీ మీటింగ్ లో ఐఎన్టీయూసీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ త్యాగరాజన్, ఏరియా వైస్ ప్రెసిడెంట్ ఎండి రజాక్, బ్రాంచ్ సెక్రటరీ తీగల క్రాంతికుమార్ ఏఐటియుసి, సెంట్రల్ కమిటీ మెంబర్ జి. వీరస్వామి, బ్రాంచ్ కార్యదర్శి మల్లికార్జున్, సముద్రాల సుధాకర్, సిఐటియు బ్రాంచ్ కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్, నరసింహారావు, టీబీజీకేఎస్ మాదాసి ఈశ్వర్, అశోక్ మాట్లాడుతూ... కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న కొత్త లేబర్ కోడ్స్ ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసారు.

44 కోడ్స్ లను 4 కోడ్స్ కుదించి , విభజించి , కేంద్రంలోని మోడీ నాయకత్వంలోని బిజెపి ప్రభుత్వం మూడోసారి అధికారంలోకి వచ్చాక కొత్త లేబర్ కోడ్ లను  అమలు చేయాలని ప్రయత్నాలు చేస్తుందని ఆరోపించారు. ఈ కొత్త లేబర్ కోడ్స్ కార్మిక హక్కులను హరిస్తాయని వీటి అమలు ప్రతిపాదనలను ఉపసంహరించుకోవాలని, దేశవ్యాప్తంగా కార్మిక వర్గం ఆందోళన చేపట్టాలని డిమాండ్ చేశారు. కార్మికుల భవిష్యత్తు, వారి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని, సింగరేణి సంస్థను కాపాడుకుంటూ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నల్ల చట్టాలకు వ్యతిరేకంగా కేంద్ర కార్మిక సంఘాలు రాష్ట్ర , ప్రాంతీయ కార్మిక సంఘాలు కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా జరిగే ఈ సమ్మె ను జయప్రదం చేయాలని, ఈ కార్యక్రమం ముగింపు ధన్యవాదాలు తెలియజేసిన ఏఐటీయూసీ నాయకులు ధార భీమయ్య, భరణి, ప్రసాద్ లు తెలియజేశారన్నారు. ఈ కార్యక్రమంలో సత్తుపల్లి ఐఎన్టీయూసీ, ఏఐటీయూసీ, సిఐటియు, టీబీజీకేఎస్, ఐఎఫ్టియు నాయకులు, కార్యకర్తలు, ఉద్యోగులు పాల్గొన్నారు.