calender_icon.png 8 July, 2025 | 4:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణ గీతా మందిరంలో శ్రీదేవి భాగవతం పారాయణం

07-07-2025 10:53:52 PM

కామారెడ్డి (విజయక్రాంతి): కామారెడ్డి పట్టణంలోని శ్రీ కృష్ణ గీతా మందిరం(Sri Krishna Geeta Mandir)లో సెప్టెంబర్ 3 వరకు శ్రీదేవి భాగవత పారాయణాన్ని కొనసాగిస్తున్నట్లు ఆలయ కమిటీ నిర్వాహకులు తెలిపారు. కామారెడ్డి పట్టణంలోని సిరిసిల్ల రోడ్డులో గల శ్రీకృష్ణ గీతా మందిరంలో నిర్వహించడం జరుగుతుందని శ్రీ గీత తత్వ జ్ఞాన సత్సంగం కమిటీ సభ్యులు తెలిపారు. శ్రీ కృష్ణా గీతా మందిరం నందు 43వ అర్థచాతుర్మాస మహావ్రతం, స్వామి వేదాంత జ్ఞాన రత్న పూజ్య బ్రహ్మ జ్ఞాన చైతన్యానంద స్వామీజీ వారి ఆధ్వర్యంలో శ్రీ కృష్ణ గీత మందిరంలో ఈ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించిన జెండా ఆవిష్కరించి కరపత్రాలను ఆవిష్కరించారు.

ఈ సందర్భంగా కమిటీ సభ్యులు మాట్లాడుతూ... హరి ఓం శ్రీ గురుభ్యోన్నమః ఆధ్యాత్మిక మనగా మతము కాదు ఆచారం కాదు సాంప్రదాయం కాదు అది జీవితం అని అన్నారు. మానవులందరూ దేవతలుగా జీవించాలని చెప్పేది ఆధ్యాత్మికం మాత్రమేనన్నారు. మహాత్ములు చూపిన మార్గంలో రాణించాలని చెప్పేది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మిక జ్ఞానం వలన మానవ సమాజంలోని అనర్థాలన్ని ఆ అనచబడతాయి. అన్ని అనర్థములకు కారణం ఆధ్యాత్మిక జ్ఞానము లేకపోవడమే కనుక మానవులందరూ ఆధ్యాత్మిక మార్గంలో ప్రయాణిస్తే లోకమంతా సుభిక్షంగా ఉంటుంది.

ప్రతి సంవత్సరం ఏకాదశి నుండి భాద్ర శుక్ల ఏకాదశి వరకు ఉదయం ఏడు గంటల నుండి 7:30 వరకు ధ్యానం ఏడు గంటల 30 నుండి 8 గంటల 30 నిమిషాల వరకు అన్నపూర్ణ ఉపనిషత్ శ్రావణం పఠనం ప్రతిరోజు సాయంత్రం 5:30 నుండి రాత్రి 7 గంటల 30 నిమిషాల వరకు శ్రీ వేద వ్యాసకృతా శ్రీదేవి భాగవత్ పారాయణం ఉంటుందన్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని ఈ కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు పాత అశోక్, ప్రధాన కార్యదర్శి అర్వపల్లి రమేష్, ఉపాధ్యక్షులు పాత వెంకటేశం, కోశాధికారి లక్ష్మీపతి, సభ్యులు టంకరి రాజయ్య, దుద్దెల సూర్యం, జగదీశ్వర్, పార్శి రాజు, మ్యాడం సుదర్శన్, వెంకటేశం, కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.