calender_icon.png 8 July, 2025 | 5:03 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

వాతావరణ సమతుల్యానికి వన మహోత్సవం దోహదపడుతుంది

07-07-2025 11:11:36 PM

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు..

భద్రాద్రి కొత్తగూడెం (విజయక్రాంతి): వాతావరణ సమతుల్యానికి మొక్కలు నాటడం ఎంతో అవసరమని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageswara Rao) అన్నారు. సోమవారం సాయంత్రం లక్ష్మీదేవి పల్లె మండలంలో "వనమహోత్సవం" కార్యక్రమ ప్రారంభోత్సవం కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. వాన మహోత్సవంలో కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, జిల్లా ఎస్పీ రోహిత్ రాజు, జిల్లా అధికారి కృష్ణ గౌడ్ ఆధ్వర్యంలో లక్ష్మిదేవిపల్లి మండలం, హేమచంద్రాపురం బీట్, చాతకొండ సెక్షన్, కొత్తగూడెం రేంజ్ & డివిజన్, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిధిలోగల 110 ఎకరాలలో మొక్కలు నాటడం జరిగినది.

 అనంతరం మంత్రి మాట్లాడుతూ... తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పచ్చదనం కోసం ప్రతిష్టాత్మకంగా మొదలుపెట్టిన "వనమహోత్సవం" కార్యక్రమంలో పాల్గొనడం చాల సంతోషంగా వుంది అని, అటవీ అధికారులు పచ్చదనం పెంపొందించడంలో ఎంతో కృషి చేస్తున్నారన్నారు. ప్రజలందరూ పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొనాలని పిలుపు నిచ్చారు. ఈ కార్యక్రమము ఏర్పాటు చేసిన అటవీ శాఖ అధికారులకు ధన్యవాదములు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు, అటవీ శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.