calender_icon.png 8 July, 2025 | 5:27 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పీరీల పండుగ త్యాగాలకు ప్రతీక..

07-07-2025 11:07:56 PM

బెల్లంపల్లి అర్బన్ (విజయక్రాంతి): మంచిర్యాల జిల్లా(Mancherial District) బెల్లంపల్లి పట్టణంలో సోమవారం రాత్రి మొహర్రం పర్వదిన వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకున్నారు. కులమతాలకతీతంగా భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని కన్నాలబస్తి, టేకులబస్తి, హనుమాన్ బస్తి, బూడిదిగడ్డ, నెంబర్ 2 ఇంక్లైన్ బస్తి, సుభాష్ నగర్, శాంతిఖని, శంషీర్ నగర్, రవీందర్ నగర్ లలో తొమ్మిది రోజుల పాటు చావడీల్లో పీరీలు కొలువుధీరాయి. నిర్వాహకులు చివరి రోజు పీర్ల చావడీల నుంచి తీసుకొచ్చి పట్టణంలోని బాజార్ ఏరియాలో ప్రదర్శించారు. భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి మొక్కలు తీర్చుకున్నారు. బజార్ ఏరియా భక్తులతో కిటకిటలాడింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసుల్ని భారీ ఎత్తున మోహరించారు. ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా తగిన జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రశాంతంగా పీరీల పండుగ ప్రశాంతంగా ముగిసింది.