calender_icon.png 8 July, 2025 | 5:33 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా ఎంఆర్పిఎస్ జెండా పండుగ

07-07-2025 11:19:54 PM

ఎంఆర్పిఎస్ జాతీయ నాయకులు నెమలి నర్సయ్య మాదిగ...

కన్నాయిగూడెం (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) కన్నాయిగూడెం మండల కేంద్రంలో సోమవారం మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి 31వ ఆవిర్భావ దినోత్సవాన్ని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు తిప్పనపెల్లి వెంకటేష్ మాదిగ, ఎంఎస్పి కన్నాయిగూడెం మండల అధ్యక్షులు చిట్యాల నరేష్ మాదిగ ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ జెండా ఆవిష్కరణ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మార్పీఎస్ కన్నాయిగూడెం మండల ఇన్చార్జి ఎంఆర్పిఎస్ జాతీయ నేత నెమలి నర్సయ్య మాదిగ హాజరై మాట్లాడుతూ... ఈ దేశంలో అట్టడుగు పేద వర్గాలకు వారి బ్రతుకుల్లో వెలుగులు నింపాలని లక్ష్యంతో గత 31 సంవత్సరాలుగా పద్మశ్రీ అవార్డు గ్రహీత మంద కృష్ణ మాదిగన్న నేతృత్వంలో ఉద్యమాలు చేసి సాధించిన వృద్ధులు వితంతువులకు, వికలాంగులకు పెన్షన్ పెంపు పథకాలే పేదల వైపు నిలబడ్డ నిజమైన పోరాటమని పేద మహిళలపై హత్యలు అత్యాచారాలు జరుగుతుంటే వాటిని నిర్మూలించాలనే పోరాటం చేసి ఫాస్ట్ ట్రాక్ చట్టాలనూ పద్మశ్రీ మంద కృష్ణ మాదిగన్న నాయకత్వంలో సాధించామన్నారు.

అదే విధంగా ఎస్సీ. ఎస్టీ ఉద్యోగులకు ప్రమోషన్లు రిజర్వేషన్ సాధించిన చరిత్ర మాదిగ దండోరా దేనని వికలాంగులకు, వృద్ధులకు పెన్షన్ హెచ్చింపుకై పోరాట చరిత్ర  పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఉద్యమాన్ని మరువద్దని రాజకీయ పార్టీలకు ప్రజాస్వామ్య మేధావులకు విజ్ఞప్తి చేశారు. ఈ మండలంలోని ఆదివాసి ప్రజలు, దళితులు, బహుజన వాదులందరు పద్మశ్రీ మందకృష్ణ మాదిగన్న ఆలోచనలో మహాజన సోషలిస్టు రాజ్యాధికారాన్ని కి పట్టం కట్టాలని పిలుపునిచ్చారు. అదేవిధంగా మందకృష్ణ మాదిగన్న 60వ జన్మదిన మైన జులై 7న ఎమ్మార్పీఎస్ ఆవిర్భవించి 31 సం, అడుగు పెట్టిన సంధర్భంలో ప్రతి మాదిగ గ్రామంలో ఎమ్మార్పీఎస్ జెండా గద్దెలలో ఎమ్మార్పీఎస్ జెండా లను ఆవిష్కరించి గ్రామాలలో మాదిగ దండోరా పండుగలు జరుపుకున్నారు.

ఈ కార్యక్రమంలో ఎంఆర్పిఎస్ జిల్లా నాయకులు పరికి మహేష్. మాదిగ. ఎంఎస్పి జిల్లా నాయకులు వాసంపెల్లి సతీష్ మాదిగ. వాసంపెల్లి విజయ్ మాదిగ. కొంచర్ల ముత్తయ్య మాదిగ. వాసంపెల్లి రాంబాబు మాదిగ. వాసంపెల్లి సారయ్య మాదిగ. వాసంపెల్లి నర్సింహా రావు మాదిగ. చిట్యాల రూపేష్ మాదిగ. వాసంపెల్లి హరీష్ మాదిగ. పరికి ప్రవీణ్ మాదిగ. మండలంలోని పలు గ్రామాల ఎంఆర్పిఎస్ గ్రామ కమిటీ అధ్యక్ష కార్యదర్శి లు. పలు గ్రామాల మాదిగ పెద్దలు. మహిళాలు యువకులు తదితరులు పాల్గొన్నారు.