07-07-2025 11:24:09 PM
ఆర్పీల యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అన్నెపర్తి రాణి..
తుంగతుర్తి (విజయక్రాంతి): ఆర్పీలకు గౌరవ వేతనం 21000 రూపాయలు అందించి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వం ఆదుకోవాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలు(MLA Mandula Samuel) ఆయన క్యాంపు కార్యాలయం తిరుమలగిరిలో మర్యాదపూర్వకంగా ఆర్పి యూనియన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షురాలు అన్నేపర్తి రాణి ఆధ్వర్యంలో వినతి పత్రం అందజేశారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఆర్పీలకు శ్రీనిధి నుండి పావలా వడ్డీ వీఎల్ఆర్ నుండి వచ్చిన రూపాయలను 6000 రూపాయలు ఆర్పీలకు జీతాలు అందిస్తున్నారని ఈ ఆరువేల రూపాయలతో ఆర్పీల కుటుంబాలు ఎంతో దీనస్థితిలో చాలీచాలని జీతాలతో సంసార జీవితాన్ని సాగించడం చాలా కష్టంగా ఉందని తమకు గౌరవమైన వేతనం అందించి మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగాలుగా గుర్తించి గౌరవప్రదమైన వేతనం ఇచ్చి ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేలుని కలిసి వినతిపత్రం అందజేస్తూ ఆర్పీలను ప్రభుత్వ చేపట్టినటువంటి అన్ని రకాల ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేసే విధంగా ఆర్పీలు అన్ని మున్సిపాలిటీ కేంద్రాల్లో నిర్వహించే ప్రభుత్వ కార్యక్రమాలకు తమ సేవలు అందిస్తున్నామని తెలియజేస్తూ గత ప్రభుత్వాలు ఆర్పీలను పట్టించుకునే పరిస్థితి లేదని ఇప్పుడైనా ఇందిరమ్మ రాజ్యం తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఆర్పీల సమస్యలను పరిష్కరించి తమకు న్యాయం చేయాలని ఇట్టి విషయాలను జూలై 14న తుంగతుర్తికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి వస్తున్నారని తెలుసుకొని మందుల సామేలు ఆర్పీల సమస్యలను విన్నవించుకొని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దృష్టికి తీసుకెళ్లి ఆర్పీల సమస్యలు పరిష్కరించి న్యాయం చేయాలని ఆర్పీలు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్పీలు మంత్రాల పద్మ, నూకల విజయ,దొంతగాని నాగమణి, పద్మ,సావిత్ర తదితరులు పాల్గొన్నారు.