07-07-2025 11:26:31 PM
తూప్రాన్ (విజయక్రాంతి): తూప్రాన్ పట్టణం పోతరాజుపల్లి శివారులోని హనుమాన్ వెంచర్ లో ఎనిమిది మంది వ్యక్తులు గంజాయి తాగుతూ అమ్ముతున్నారని సమాచారం రావడంతో తూప్రాన్ ఎస్ఐ శివానందం( SI Shivanandam) తన సిబ్బంది, క్లూస్ టీం సిబ్బందితో కలిసి అక్కడికి వెళ్ళి వారిని చాకచక్యంగా పట్టుకొనే ప్రయత్నంలో ఇద్దరు వ్యక్తులు అక్కడి నుండి తప్పించుకొని పారిపోగా మిగిలిన ఆరుగురు వ్యక్తులని పట్టుకొని పంచుల సమక్షంలో విచారణ చేయగా తుమ్మల ప్రశాంత్, బోసు కనకరాజు, బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోష్ పాశ్వాన్ సంతుకుమార్, హరి రామ్ హీరా, హిర కుమార్, ఇద్దరు బాలురు తప్పించుకొని పారి పోయిన వ్యక్తుల పేర్లు పిట్ల నవీన్, మోర లక్ష్మణ్ గ్రామం కిస్టాపూర్ గా తెలిసింది.
వారి నుండి 260 గ్రామాల గంజాయిని, 5 సెల్ ఫోన్ లని, రెండు టూవీలర్ వాహనాలని 3,౦౦౦ రూపాయల నగదు స్వాదిన పర్చుకొని నిందితులని రిమాండ్ కు తరలించనయినది. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన ఎస్ఐ. శివానందం, సిఐ రంగ కృష్ణ, తూప్రాన్ సర్కిల్, తూప్రాన్ పోలీస్ సిబ్బందిని డీఎస్పీ నరేందర్ గౌడ్ అభినందించారు.