08-07-2025 02:03:25 AM
శుభాకాంక్షలు తెలిపిన మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి
హైదరాబాద్ సిటీ బ్యూరో, జూలై 7 (విజయక్రాంతి): మల్కాజిగిరి చౌరస్తాలో సోమ వారం మల్కాజిగిరి మాదిగ రిజర్వేషన్ పో రాట సమితి ఆధ్వర్యంలో ఎమ్మార్పీఎస్ 31 ఆవిర్భావ దినోత్సవం, పద్మశ్రీ మందకృష్ణ మాదిగ జన్మదిన వేడుకలు నిర్వహించారు. ముఖ్య అతిథిగా మల్కాజిగిరి మాజీ ఎమ్మె ల్యే మైనంపల్లి హనుమంతరావు హాజరయ్యారు.
మందకృష్ణకు పుట్టినరోజు శుభా కాంక్షలు తెలిపి, కేక్ కట్ చేశారు. మందకృష్ణ నాయకత్వం వర్ధిల్లాలని నినాదాలు చేశారు. బడుగు బలహీన వర్గాల కోసం పోరాటం చేస్తున్న గొప్ప మనిషి మందకృష్ణ మాదిగ అని కొనియాడారు. మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల పోరాట ఫలితమే ఎస్సీ వర్గీకరణ అని చెప్పారు.
కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఇన్‌చార్జి తిప్పారపు లక్ష్మణ్ మాదిగ, ఎమ్మెస్పీ జిల్లా అధ్యక్షుడు రామచందర్ కేశపాగ, మాదిగ జర్నలిస్టు ఫోరం రాష్ట్ర నాయకుడు మనోహర్, దివ్యాంగుల హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు వినయ్, మల్కాజిగిరి ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి వడ్డేపల్లి శివ మాదిగ, కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ వైపు ప్రేమ్‌కుమార్, నాయకులు వెంకటేష్ యాదవ్, బికే శ్రీనివాస్, గుండా నిరంజన్, జీడి సంపత్ గౌడ్, వినోద్ యాదవ్ సంతోష్ రాందాస్, రోహిత్ కుమార్, ఇస్తారి, నరేష్, శంకర్, పార్థసారథి, అరుణ్, తదితరులు పాల్గొన్నారు.