calender_icon.png 8 July, 2025 | 8:42 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘ అధ్యక్షుడిగా మహేష్

08-07-2025 02:02:50 AM

యాదాద్రి భువనగిరి జూలై 7 (విజయ క్రాంతి): తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘ సర్వసభ్య సమావేశం యాదాద్రి జిల్లాలో సోమవారం జరిగింది.  పద్మశాలీల సమస్యలపై సుదీర్ఘంగా సమావేశం చర్చించిన అనంతరం నిజామాబాద్ జిల్లా పద్మశాలి సంఘం అధ్యక్షుడిగా బిల్లా మహేష్ ను నియమిస్తూ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు కమ్మర్తపు మురళి నియామక పత్రాన్ని అందజేశారు.

ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ పద్మశాలీల ఐక్యతకు ప్రతి ఒక్కరు పాటుపడి సంఘాల అభివృద్ధి కొరకు కృషి చేయాలని సూచించారు.  ఈ కార్యక్రమంలో అఖిలభారత పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి గడ్డం జగన్నాథం, రాష్ట్ర పద్మశాలి సంఘం ప్రధాన కార్యదర్శి రామచంద్రారావు, ఎస్సార్ సత్యపాల్ పాల్గొన్నారు .