calender_icon.png 23 July, 2025 | 1:47 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

రేపు జనగామ ఆర్టీసీ బస్‌స్టేషన్‌లో సంబురాలు

23-07-2025 12:00:00 AM

 జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ 

జనగామ, జూలై 22 (విజయక్రాంతి): మహాలక్ష్మి పథకంలో భాగంగా జిల్లా కి సంబందించి...ఇప్పటి వరకు ఆర్టీసీ లో 2.26 కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారని  జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ మంగళవారం ఒక ప్రకటన లో తెలిపారు.

ఈ ప్రయాణం వలన.. 108.97 కోట్ల ఆదాయం ఆర్టీసీ కి సమాకూరిందని...ఆర్టీసీ లో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం 2023 డిసెంబర్ 9వ తేదీ నుండి విజయవంతంగా అమలవుతోందని ఈ సందర్బంగా గుర్తు చేశారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని... బుధవారం జనగామ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ ప్రయాణ ప్రాంగణంలో సంబరాలు, ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని కలెక్టర్ తెలిపారు