calender_icon.png 24 July, 2025 | 1:48 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నానో యూరియాపై అవగాహన పెంపొందించాలి

23-07-2025 12:00:00 AM

మహబూబాబాద్, జూలై 22 (విజయ క్రాంతి): నానో యూరియా వినియోగంపై రైతులకు అవగాహన పెంపొందించే విధంగా వ్యవసాయ, సహకార శాఖ అధికారులు, ఎరువుల డీలర్లు కృషి చేయాలని జయశంకర్ భూపాలపల్లి జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ సూచించారు. కలెక్టర్ కార్యాలయంలో నానో యూరియా వినియోగం, ఎరువుల సక్రమ సరఫరా పై సమీక్ష నిర్వహించారు. రైతులకు సాగులో ఆధునిక వ్యవసాయ శాస్త్రీయ పద్ధతులను వివరించాలని, తక్కువ పెట్టుబడి అధిక దిగుబడి సాధించే విధంగా కృషి చేయాలని,  నానో యూరియా వినియోగం వల్ల కలిగే లాభాలను రైతులకు వివరించి, సాధారణ యూరియా వినియోగాన్ని తగ్గించే విధంగా కృషి చేయాలని సూచించారు.

ఎరువుల డీలర్లు తమ వద్ద ఉన్న ఎరువుల నిల్వకు సంబంధించిన వివరాలను ప్రతిరోజు బోర్డుపై ప్రదర్శించాలని, కృత్తిమ కొరత సృష్టిస్తే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలిగినా వ్యవసాయ శాఖ ఏర్పాటు చేసిన టోల్ ఫ్రీ నెంబర్ 8977741771, కలెక్టర్ కార్యాలయంలోని కంట్రోల్ రూమ్ 7893098307 ఫోన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలని కోరారు. వర్షాకాలం పంటల సాగుకు అవసరమైన ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఆగస్టు నెల వరకు సరిపడా ఎరువులు ఉన్నందున రైతులు అపోహలకు గురికాకూడదని కోరారు. ఈ సమావేశంలో కాటారం సబ్ కలెక్టర్ మాయాంక్ సింగ్, ఏ ఎస్ పి నవీన్ కుమార్, వ్యవసాయ అధికారి బాబు, ఏడిఏ శ్రీ వ్యాల్, కోరమండల్ జిఎం సర్జన్ కుమార్ పాల్గొన్నారు.