31-12-2025 07:18:52 PM
నిర్మల్,(విజయక్రాంతి): ప్రజలకు మేలు చేయాలన్న ఉద్దేశంతో ఆమ్ ఆద్మీ పార్టీ నిస్వార్థ పాలనపై దృష్టి పెట్టిందని జిల్లా పార్టీ కన్వీనర్ సయ్యద్ హైదర్ అన్నారు మంగళవారం రాబోయే మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో నిర్మల్ జిల్లాలో మూడు మున్సిపాలిటీలో ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులను నిలబెడుతుందని తెలిపారు. సమాజంలో మార్పు అభివృద్ధి కోసం ఆమ్ ఆద్మీ కృషి చేస్తుందని ప్రజలు సహకరించాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు వినోద్ సాదిక్ మహమూద్ పాల్గొన్నారు.