calender_icon.png 13 September, 2025 | 5:39 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు ఏర్పాటు చేయాలి

13-09-2025 01:02:46 AM

- జిల్లా వ్యాప్తంగా శిధిలావస్థలో ఉన్న ప్రభుత్వ పాఠశాలలకు నూతన భవనాలను నిర్మించాలి

- ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్

- విద్యారంగం సమస్యలు పరిష్కరించాలని రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా జిల్లా అధికారికి వినతిపత్రం అందజేత

భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 12, (విజయక్రాంతి):జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలు శిధిలావస్థకు వచ్చిన భవనాలను పరిశీలించి జిల్లా ఉన్నతాధికారులు నూతన భవనాల ఏర్పాటుకు కృషి చేయాలని ఏఐఎస్‌ఎఫ్ జిల్లా కార్యదర్శి వరక అజిత్ కోరారు. ఏఐఎస్‌ఎఫ్ రాష్ట్ర సమితి పిలుపులో భాగంగా శుక్రవారం కలెక్టర్ కార్యాలయం సూపర్డెనెంట్ శ్రీధర్ కు సమస్యలుతో కూడిన వినతిపత్రం అందచేశారు.

ఈ అజిత్ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ పాఠశాలలు అర కోర వసతులతో నడుస్తున్నాయని కనీస మౌలిక వసతులు లేక విద్యార్థులు ఇబ్బందులు గురవుతున్నారని అన్నారు. ప్రభుత్వ పాఠశాలలలో చదువుకునే విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తామని ప్రభుత్వాలు ప్రగడ్బాలు పలుకుతూనప్పటికీ వానకు వలవల ఎండకు విలవిలాడుతున్న చదువులకు దూరం అవుతున్నారని అన్నారు.

ప్రభుత్వ విద్యారంగనీ, భవనాలను, పాఠశాల వాతావరణాన్ని పట్టించుకోకుండా విద్యకు మెరుగయ్యే ఏ వసతుల్ని అందించే దాంట్లో కూడా జిల్లా విద్యాశాఖ అధికారులు చొరవ చూపటం లేదని అజిత్ అన్నారు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలను సందర్శించి ఒక నిర్దిష్టమైన నివేదికను అందించాలని ఎంఈఓలు, డిఈఓ ప్రభుత్వ విద్యారంగాని బలోపితం చేయడానికి కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షులు ఎస్కే షాహిద్ జిల్లా సహాయ కార్యదర్శి గుండాల సుజన్ ఇనపల్లి పవన్ సాయి వినయ్ జిల్లా ఉపాధ్యక్షులు సంజయ్ నాజిర్ తదితరులు పాల్గొన్నారు