15 April, 2026 | 6:33 AM

మురికి కాలువ పనులు పరిశీలించిన చైర్మన్ రజిత శ్రీనివాస్

07-11-2025 07:14 PM

నకిరేకల్,(విజయక్రాంతి): నకిరేకల్ పట్టణ అభివృద్ధి కార్యక్రమాల్లో భాగంగా మున్సిపల్ చైర్మన్ చౌగోని రజిత శ్రీనివాస్ శుక్రవారం 9వ వార్డులో జరుగుతున్న మురికికాలువ నిర్మాణ పనులను కాంట్రాక్టర్‌తో కలిసి పరిశీలించారు.శాసన సభ్యులు కేటాయించిన ₹6 కోట్లు నిధులతోమురికికాలువ పనులు కొనసాగుతున్నాయి.