calender_icon.png 27 September, 2025 | 12:06 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

చాకలి ఐలమ్మ పోరాట స్ఫూర్తి ఆదర్శనీయం: జిల్లా కలెక్టర్ పమేలా సత్పత్తి

26-09-2025 10:45:19 PM

కరీంనగర్,(విజయక్రాంతి): తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, భూమికోసం, భుక్తి కోసం, వెట్టి చాకిరి విముక్తి కోసం పోరాడిన వీరనారి.. చాకలి ఐలమ్మ అని, ఆమె పోరాట స్ఫూర్తి ఆదర్శనీయమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి పేర్కొన్నారు. శుక్రవారం చాకలి ఐలమ్మ జయంతి సందర్భంగా జిల్లా కేంద్రంలోని ప్రతిమ మల్టీప్లెక్స్ వద్ద ఉన్న ఐలమ్మ విగ్రహానికి జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి, అడిషనల్ కలెక్టర్ అశ్విని తానాజీ వాకడే, నగర పాలిక కమిషనర్ ప్రపుల్ దేశాయ్ పూలమాలలు వేసి నివాళులర్పించారు.