27-09-2025 12:04:37 AM
సాయిపల్లవి బికినీలో ఉన్న ఫొటోలు ఇటీవల సోషల్‌మీడియాను షేక్ చేశాయి. ఆ ఫొటోలు చూసీచూడగానే చాలా మంది నుంచి విమర్శలు వెల్లువెత్తాయి. ఇదిగో సాక్ష్యాలంటూ కొన్ని పోస్టులు కనిపించాయి. కానీ, అవి నిజం కాదంటూ మెజారిటీ ఫ్యాన్స్ కొట్టిపారేశారు. ఇదంతా ఎంతవరకు నిజమో తెలియదు. ఎందుకంటే సాయిపల్లవి అధికారిక ఖాతా నుంచి విడుదలైన ఫొటోలు కాదు. ఔను, అవన్నీ ఫేక్ అని, ఏఐ మాయ అని సాయిపల్లవి పెట్టిన తాజా పోస్టు తేల్చేసింది.
శుక్రవారం ఓ ట్రిప్‌నకు సంబంధించిన వీడియోను సాయిపల్లవి సోషల్‌మీడియాలో పంచుకుంది. దానికి ‘పైన కనిపిస్తున్న ఫొటోలు ఏఐ కాదు.. నిజమైనవే’ అంటూ తనదైన శైలిలో స్పందించింది. అంటే, తాజా ఫొటోలు నిజమైనవని చెప్పడం ద్వారా బికినీ ఫొటోలు ఏఐ అని పరోక్షంగా క్లారిటీ ఇచ్చి రచ్చకు తెరదించింది. ఈ తాజా పోస్టు కింద వేలాది మంది ‘మేమంతా నీ వెంటే ఉన్నాం..’ అంటూ ఆమెకు మద్దతుగా పోస్టులు పెడుతున్నారు.
ఇక సాయిపల్లవి సినిమాల విషయానికొస్తే.. ప్రస్తుతం బాలీవుడ్ ‘రామాయణ’లో సీతగా నటిస్తోంది. ‘బలగం’ దర్శకుడు వేణు రూపొందించ నున్న ‘ఎల్లమ్మ’లో కథానాయికగా సాయిపల్లవి దాదాపు ఖరారైందని తెలుస్తోంది. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ సినిమా కథను ఆమె విన్నదని టాక్. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ఫిబ్రవరి నుంచి షూటింగ్ ప్రారంభించుకోనుందట.