27-09-2025 12:03:40 AM
పవన్‌కల్యాణ్ నటించిన ‘ఓజీ’ సినిమా నిర్మాతలకు హైకోర్టు మరోసారి షాకిచ్చింది. ఈ సినిమా టికెట్ ధరల పెంపుపై హైకోర్టులో శుక్రవారం వాదనలు ముగిశాయి. డివిజన్ బెంచ్‌లో మూవీ యూనిట్ తరఫున సీనియర్ న్యాయవాది నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. రివ్యూ పిటిషన్‌పై ఇరు వర్గాల వాదనలు విన్న కోర్టు.. టికెట్ ధరలు పెంచడానికి వీల్లేదని స్పష్టం చేసింది. ఇటీవల సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలే కొనసాగుతాయని సూచించింది. టికెట్ రేట్ల పెంపునకు అనుమతి ఇవ్వడా నికి కారణాలు తెలియజేస్తూ కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను అక్టోబర్ 9వ తేదీకి వాయిదా వేసింది. అయితే, ‘ఓజీ’ బృందం తరఫు న్యాయవాది వాదనలు ఇప్పుడు చర్చనీయాంశమయ్యాయి. “ఫైవ్‌స్టార్ హోటల్‌లో కాఫీ రూ.500 ఉంటుంది. దిల్జీత్ షో టికెట్ ధర వేలల్లో ఉంటుంది. ఆ ధరపై నిర్ణయం నిర్వాహకులదే. సిని మా టికెట్ ధరలను ప్రభుత్వం రెగ్యులేట్ చేస్తుంది. ఇదే ‘ఓజీ’ని ఢిల్లీలో చూడాలంటే రూ.1500లు పెట్టాలి. ఐపీఎల్ టికెట్ రూ.1500.. ఆ టికెట్లు రూ.200కే కావాలని కోర్టుకు ఎందుకు రారు? సినిమా టికెట్లపై అదనంగా పెంచిన ఆ రూ. 150 కూడా పిటిషనర్‌కు కష్టం అనుకుంటే సాధారణ రేట్ ఉన్నప్పుడే సినిమా చూడాలి. నచ్చిన ధరల్లో తొలి రోజే చూడాలనుకో వడం ఏంటి?” అంటూ నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు.