27-09-2025 12:00:00 AM
కండువా కప్పి ఆహ్వానించిన రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి
నిజామాబాద్, సెప్టెంబర్ 26 (విజయక్రాంతి) : నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో శుక్రవారం డిచ్పల్లి మండలం కమలాపూర్ గ్రామనికి చెందిన బిఆర్‌ఎస్, బిజెపి పార్టీలకు చెందిన నాయకులు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలో చేరారు.బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు పొల్లసాని శ్రీనివాస్ ఆధ్వర్యంలో నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ ఆర్. భూపతి రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
ఈ సందర్భంగా కొట్టాల బురన్న, కొట్టాల రమేష్, నల్ల బుచ్చన్న, గణేష్, వడ్ల గంగాధర్, ఇస్మాయిల్, వడ్డెన్న, సాయిలు, ఇబ్రహీం, అఫ్జల్, ఆరిఫ్ తదితరులు కాంగ్రెస్ పార్టీలో చేరారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు కంచెటి గంగాధర్, డిచ్పల్లి సొసైటీ చైర్మన్ రామచందర్ గౌడ్, గ్రామ అధ్యక్షుడు గొల్ల గోపాల్, మాజీ ఉపసర్పంచ్ ఆశారెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ రాజేందర్, డిసిసి డైరెక్టర్ ఎన్. రాజేశ్వర్ తదితరులు పాల్గొన్నారు.