calender_icon.png 27 September, 2025 | 1:19 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అన్నపూర్ణ ఆ సరస్వతమ్మ

27-09-2025 12:05:05 AM

ఆచార్య మసన చెన్నప్ప :

ఆమె గుండేరావు హర్కారేకు కోడలవుతుంది. ఆమె పేరు సరస్వతమ్మ. గుండేరావు బాగోగులు చూసేది ఆ మే. ఆమె లేకపోతే గుండేరావుకు అన్నం పెట్టేవాళ్లే లేరు. ఆమె గుండేరావు దత్తపుత్రునికి వదిన అవుతుంది. దత్తపుత్రుడు గుండేరావును వంచించి అతని భూములను ఫోర్జరీ సంతకాలతో ఇతరులకు అమ్మేశాడు. అట్లా అమ్మిన భూముల్లో మంకాల్ మహేశ్వరంలోని వందల ఎకరాలు, అల్యాబాదులోని తోట మొదలైనవి ఉన్నాయి.

తన ఆస్తి పాస్తులను అన్యాయం గా పోగొట్టుకున్న గుండేరావు దిక్కులేనివాడయ్యాడు. పిల్లలు కలగకపోతే దేవుడివ్వలేదని ఊరుకోవాలి తప్ప, ఎవరినో ఒకరిని దత్తత తీసుకోరాదు. పుత్రులు లేకపోతే గతులు లేవన్న వచనం వేద వచనం కా దు, ఎవరో తెలివిగలవారు ఆ వచనాన్ని సృష్టించారు. వేదం ప్రకారం మనకు పుత్ర సంపద గాని, మరే సంపద గాని భగవంతుడీయవలసిందే. ముఖ్యంగా పుత్ర సంపద భగవంతుని అనుగ్రహం వల్ల లభిస్తుంది.

సంతానం లేకపోతే నష్టమేమీ లే దు. పిల్లలు ఉద్ధరిస్తారని అనుకుంటాం గాని, అది యథార్థం కాదు. దత్త పుత్రుని వల్ల బాధలనుభవించిన గుండేరావు నా తో స్వయంగా ‘అపుత్రస్యగతిర్నాస్తి’ అన్న వాక్యం వేద సమ్మతం కాదు, కల్పితం అన్నారు. దత్తపుత్రుని వల్ల నిరాశ్రయులైన వృద్ధ గుండేరావును ఆదుకోవడానికి సరస్వతమ్మ ముందుకు వచ్చింది. ఆమె గుండేరావు గద్వాలలో సెషన్ జడ్జిగా ఉన్నప్పటి వైభవం కళ్లారా చూసింది. నిత్యం గుండేరావు గారి ఇంట్లో నలభై మందికి తక్కువగా ఆతిథ్యం లభించేది కాదు. 

దత్తపుత్రుని నిర్వాకం

గుండేరావు నిజాం పరిపాలనలో గొ ప్ప న్యాయమూర్తి. గద్వాల సంస్థానానికి మహారాణి ఆదిలక్ష్మీదేవమ్మ ఆస్థాన పండితునిగా వెలుగొందినాడు. ఇట్టి పండితుని వైభవాన్ని కళ్లారా చూసిన సరస్వతమ్మ దిక్కుమొక్కు లేని గుండేరావుకు దిక్కుంది. పాతపట్నంలోని బెరూన్ గౌలిపురాలో ఒక రేకుల ఇంటిని అద్దెకు తీసుకొని అక్కడ నివాసం ఏర్పాటు చేసింది. సరస్వతమ్మ భర్తృహీనురాలు. పిల్లలు కూడా లేరు. ఆమె కూడా ఏకాకియే.

ఏకాకులకు ఏకాకులే ఆశ్రయం ఇస్తారంటారు కదా! ఇదీ దైవ నిర్ణయం! గుండేరావు దత్తపుత్రుని నిర్వాకం గర్హనీయమైంది. అతడు కూడా న్యాయవాద వృత్తిలోనే ఉన్నవాడు. కానీ నేతి బీరకాయలో నెయ్యి లేనట్లే అతనిలో ఏ కోశాన న్యాయం లేదు. అతడు నిర్దాక్షిణ్యంగా తన భార్యను, పిల్లలను కూడా అనాథలను చేశాడు. దిక్కులేని వారు గుండేరావును ఆశ్రయించారు. ఒక విధం గా అందరికి సరస్వతమ్మ అన్నపూర్ణగా మారిపోయింది.

పిల్లల పెళ్లిళ్లు కూడా చే సింది. మామగారైన గుండేరావు బాగోగులను సరస్వతమ్మగారెంతో జాగ్రత్తగా చూ సుకునేవారు. గుండేరావు గారికి నిజాం ప్రభుత్వం వల్ల లభించిన పెన్షన్ మాత్రమే ఆధారం. సరస్వతమ్మ గుండేరావును చూడడానికి వచ్చే వారికి కూడా అతిథి మర్యాదలు చేసేది.  

ఆకలి తీర్చిన ‘అమ్మ’

అది 1973వ సంవత్సరం. నేను గౌలిపురాలో ఉండి చదువుకోవలసిన అవస రం ఏర్పడింది. నేను నా స్నేహితులతో కలిసి సారస్వత పరిషత్తులో చదువుకుంటున్నాను. మాకు అద్దెకు ఒక రూం కావలసి వచ్చింది. మేం బ్రహ్మచారులం కాబట్టి ఎవరూ మాకు అద్దెకు రూం ఇవ్వలేదు. నేను రవ్వా శ్రీహరిగారి వల్ల గుండేరావుకు అప్తుడనయ్యాను. కాని మేమెక్కడుండాలి? సరస్వతమ్మ గారే గుండేరావు ఇంటికి సమీపంలో ఒక గదిని అద్దెకు ఇప్పించారు.

ఆ గది ఉన్న ఇంట్లో అన్ని వసతులున్నాయి. ఆ ఇల్లు పెద్దది. నాలుగైదు కుటుంబాల వారికది నివాస యోగ్యం. ఆ ఇంట్లో ఏడెనిమిది మంది ఆడపిల్లలున్నారు. ఐనా మాకు ఆ ఇంట్లో ఒక గది అద్దెకు లభించడం సరస్వతమ్మ గారి వల్లనే సాధ్య మైంది. సరస్వతమ్మను నేను ‘అమ్మా’ అని పిలిచేవాణ్ణి. నన్నామె ‘చెన్నప్పా’ అని ఎంతో ప్రేమతో పిలిచేది. ఆమె కులమత బేధాలను పాటించేది కాదు. ఒక మూడేళ్ల పాటు అప్పడప్పుడామె నాకు భోజనం పెట్టి ఆకలి తీర్చేది.

పాతపట్నంలో నాకు అమ్మ దొరికింది అని సంబరపడిపోయేవాణ్ణి. వారు బ్రాహ్మణులైనప్పటికీ నన్నె ప్పుడూ చిన్నచూపు చూడలేదు. నేను ఇంట్లో మనిషిలా మెలిగేవాణ్ణి. గుండేరావు ప్రక్కనే నన్ను కూర్చోమని, నాకు కూడా అన్నం వడ్డించేది. సొంత కొడుకుగా భా వించి నా బాగోగులు అరుసుకునేది. 1975లో సికింద్రాబాదులో నాకు తెలుగు పండితుడిగా ఉద్యోగం లభించినప్పుడు ఆమె ఎంతో ఆనందించింది. 

బహుమతిగా వెండి గ్లాసు

గుండేరావును నేను ‘తాతయ్యా’ అనేవాణ్ణి. ఆయన ‘ప్రభావతీప్రద్యుమ్న’ కా వ్యాన్ని సంస్కృతీకరించినప్పుడు, నేనే తెలుగు మూలపత్రిని చదివి వినిపించేవాణ్ణి. గుండేరావుకు నేను లేఖకునిగా ఉ న్నందుకు ఆమె ఎంతగానో మురిసిపోయింది. 1976లో నా వివాహం జరిగింది. గుండేరావు హర్కారే ఉన్న వీధిలోనే మా అత్తగారి ఇల్లు. వివాహం జరిగిన రోజు సరస్వతమ్మగారు ఎంతో దగ్గరుండి అన్ని పనులు పర్యవేక్షించింది.

నా భార్య ప్రమీల అంటే ఆమెకు ఎంతో అభిమానం. ప్రతీ సంవత్సరం సరస్వతమ్మ దత్తాత్రేయ జ యంతిని గొప్పగా జరిపేది. బంధువుల కంటే మిత్రులే ఎక్కువ మంది వచ్చేవారు. ఆమె బ్రతికినన్ని రోజులు దత్తాత్రేయుని పూజను మరవకుండా చేసింది. నేను ఉ ద్యోగిని కాబట్టి ప్రతి సంవత్సరం కొంత ధన సహాయం చేసేవాణ్ణి. పూజ జరిగే రోజు ఆమె మాకోసం ఎదురుచూసేది. మ ధ్యన ఒక సంవత్సరం ఏ కారణాల వల్లనైనా పోకపోతే బాధపడేది.

నేను సరస్వ తమ్మలో మా అమ్మనే చూశాను. ఆమె కూడా నాలో సొంత కుమారుణ్ణి చూసిం ది. గుండేరావు అస్తమించిన తర్వాత సుమారు ముప్పు ఏళ్లు బ్రతికింది. నేను బోడుప్పల్‌కు నివాసం మార్చిన తర్వాత ప్రతి సంవత్సరమే కాక, మధ్యలో కూడా వెళ్లి వచ్చేవాణ్ణి. ఇక రెండు నెలలకు ఆమె పరమపదిస్తుందనగా అకస్మాత్తుగా ఆటో లో మా ఇంటికి వచ్చింది.

అంతకుముం దు మా ఇంట్లో జరిగిన గీతా జయంతికి రాలేనందుకు విచారాన్ని వెలిబుచ్చుతూ ఒక వెండి గ్లాసును ప్రెజెంట్ చేసింది. అం తేకాక, ఎన్నాళ్ల నుంచో భద్రంగా దాచి ఉం చిన గుండేరావు తాతయ్య చిత్రపటాన్ని నా చేతిలో ఉంచి ‘ఈ తాతయ్య నీ దగ్గర ఉండడమే మంచిదని తెచ్చాను’ అని కన్నీటిపర్యంతమైంది. నేను కూడా దుఃఖాన్ని ఆపుకోలేకపోయాను. అప్పుడు ‘గుండేరావు నీ గుండెలో ఉన్నాడు’ అన్న డాక్టర్ రాధశ్రీ మాటలు గుర్తుకువచ్చాయి.

వ్యాసకర్త సెల్: 98856 54381