calender_icon.png 9 May, 2025 | 4:59 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా చంద్రబాబు పుట్టినరోజు వేడుకలు

20-04-2025 05:08:25 PM

మునగాల: సూర్యాపేట జిల్లా మునగాల మండల కేంద్రములో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో స్వర్ణాంధ్ర రథసారధి అమరావతి రూపశిల్పి స్ఫూర్తి ప్రదాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు(Andhra Pradesh CM Nara Chandrababu Naidu) 75వ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించి ఈ సందర్భంగా మండల పరిధిలోని ముకుందాపురం వృద్ధాశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.

ఈ సందర్భంగా నాదెళ్ల గోపాలరావు మాట్లాడుతూ... ఈలాంటి గొప్ప నాయకుడు అడుగుజాడల్లో నడవడం మా అదృష్టంగా భావిస్తున్నామని ఆ పార్టీ సేవలో ఆయన చూపిన మార్గంలో పైన ఇస్తూ పార్టీ అభివృద్ధికి కృషి చేస్తామని ఇలాంటి జన్మదినోత్సవాలు చంద్రబాబు మరెన్నో జరుపుకోవాలని సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలని ఆ భగవంతుని ప్రార్థిస్తున్నామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ మాజీ ఇన్చార్జ్  ఓరుగంటి ప్రభాకర్ జిల్లా పార్టీ మాజీ కార్యదర్శి కృష్ణారెడ్డి రాష్ట్ర ఎస్ఎస్సి కార్యవర్గ సభ్యులు శ్రీమన్నారాయణ పార్టీ మండల శాఖ మాజీ అధ్యక్ష కార్యదర్శులు గోపాల్ రావు పూర్ణ శంకర్ వసంత కుమార్ తదితరులు పాల్గొన్నారు.