calender_icon.png 8 October, 2025 | 10:31 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు రవీందర్ కు ఘనంగా సన్మానం..

08-10-2025 07:28:43 PM

సుల్తానాబాద్ (విజయక్రాంతి): సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముత్యాల రవీందర్ జన్మదిన పురస్కరించుకొని బుధవారం ఆయన మిత్రులు, క్రీడాకారులు, నాయకులు, స్నేహితులు శాలువా కప్పి ఘనంగా సన్మానించారు. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని శాస్త్రి నగర్ అభయ ఆంజనేయ స్వామి దేవాలయం వద్ద, ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానం ఆవరణలో సన్మాన కార్యక్రమం జరిగింది. సన్మానించిన వారిలో పూజారి గూడ  రమేష్ శర్మ, మాజీ మార్కెట్ చైర్మన్ సాయిరీ మహేందర్, స్వర్ణకారుల సంఘం ప్రతినిధి కందుకూరి ప్రకాష్ రావు(పెద్దన్న), నాయకులు వేగోళం అబ్బయ్య గౌడ్, శంకర్, హరికిషన్ తో పాటు పలువురు పాల్గొన్నారు.