08-10-2025 07:26:18 PM
ఎమ్మార్పీఎస్ నాయకులు..
హుజూరాబాద్ (విజయక్రాంతి): మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కు మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ బహిరంగ క్షమాపణ చెప్పాలని ఎమ్మార్పీఎస్, ఎంఎస్పీ నాయకులు డిమాండ్ చేశారు. కరీంనగర్ జిల్లా హుజరాబాద్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో మంత్రి పొన్నం ప్రభాకర్ దిష్టిబొమ్మను బుధవారం దహనం చేశారు. పొన్నంకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. సహచర మంత్రిని అసభ్యపదజాలంతో దూషించడం సరైన పద్దతికాదని అన్నారు. మంత్రి పొన్నం మాదిగల ఓట్లతో గెలిచారని గుర్తు చేశారు. క్షమాపణ చెప్పకపోతే ఉద్యమాన్ని ఉదృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తునికి వసంత్, వెంకటస్వామి, రుద్రారపు రాంచంద్రం, మారెపల్లి శ్రీనివాస్, దేవునూరి రవీందర్, అంబాల రాజు తదితరులు పాల్గొన్నారు.