calender_icon.png 5 November, 2025 | 6:36 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో బీఆర్‌ఎస్‌దే విజయం

05-11-2025 01:34:34 AM

-బీఆర్‌ఎస్‌కు 43 శాతం, కాంగ్రెస్‌కు 38 శాతం, బీజేపీకి 10 శాతం ఓట్లు

-చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే రిపోర్టు 

ఖైరతాబాద్, నవంబర్ 4 (విజయక్రాంతి): జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎ స్‌దే విజయం అని చాణక్య స్ట్రాటజీస్ పొలిటికల్ సర్వే తెలిపింది. ఈ మేరకు మంగళ వారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో ఏర్పాటు మీడియా సమావేశంలో చాణక్య రిపోర్టును వెల్లడించారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో బీఆర్‌ఎస్ పార్టీకి 43 శాతం, కాంగ్రెస్‌కు పార్టీకి 38 శాతం, బీజేపీకి 10 శాతం, ఇతరులకు 9 శాతం ఓట్లు పోలయ్యే అవకాశం ఉందని తెలిపారు.

కాగా మూడు నాలుగు రోజుల క్రితం కూడా ‘కోడ్మో-కనెక్టింగ్ డెమోక్రసీ’ సంస్థ, ‘కేకే సర్వేస్ అండ్ స్ట్రాటజీస్’ సంస్థ వేర్వేరుగా నిర్వహించిన సర్వేలో బీఆర్‌ఎస్‌దే విజయమని తేలిందని అన్నారు. మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్‌లో 50.5 శాతం మంది ముస్లింలు గులాబీ పార్టీకి పట్టంగట్టినట్టు ‘బిలియన్ కనెక్ట్’ సర్వేలో తేటతెల్లమైందని అన్నారు. బయటి సర్వేలే కాదు కాంగ్రెస్ అంతర్గత సర్వేల్లోనూ హస్తం పార్టీ కంటే బీఆర్‌ఎస్ పార్టీనే జూబ్లీహిల్స్‌లో ముందంజలో ఉన్నట్టు తేలడం గమనార్హం అని తెలిపారు.