10-07-2025 12:00:00 AM
చలాది పూర్ణచంద్ర రావు :
ఆధునిక యుద్ధ రీతులు మారుతున్నాయి. ఇన్ఫాంట్రీ, ట్యాంక్‌ల యుద్ధ తంత్రం ముగిసి ఆధునిక పోకడలు చోటుచేసుకున్న నేటి యుద్ధ రీతుల్లో మిస్సు ల్ వ్యవస్థలు ఎనలేని పాత్ర పోషిస్తున్నాయి. గురి తప్పని సుదూర లక్ష్యాలని క్షణాల్లో ఛేదించే ఈ క్షిపణులు వదిలితే చాలు శత్రు దేశాలు మాడిపోవాల్సిందే.
చూసి రమ్మంటే కాల్చి వచ్చే ఈ క్షిపణులను ఇటీవల భారత్ ఆపరేషన్ సిందూర్‌లో పాక్‌పై ప్రయోగించి.. దాయాది కలలో కూడా ఊహించని నష్టాన్ని కలిగించింది. మారుతున్న యుద్ధ రీతుల్లో క్షిపణి వ్యవస్థని మరింతగా అభివృద్ధి చేసేందుకు కేంద్రం అన్ని చర్యలు వేగవంతం చేస్తోంది కూడా.
ఇందులో భాగంగానే ఇప్పటికే కృష్ణా జిల్లా కేంద్రం మచిలీపట్నంలో రక్షణ దళాల కోసం నైట్ విజన్ పరికరాల (రాత్రివేళ చూ డగలిగే) తయారీ మొదలయింది. దేశంలోనే ప్రతిష్ఠాత్మకమైన ‘భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్) యూనిట్ ఇప్పటికే ఉండగా, దేశంలోనే రెండవ మిస్సుల్ ఫైర్ టెస్టింగ్ సెంటర్‌ని ఏపీలోని మచిలీపట్నం సమీపంలోని నాగాయలంక మండలం సముద్ర తీరగ్రామం గుల్లలమోద వద్ద డిఫె న్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆధ్వర్యంలో రూ. 20వేల కోట్ల వ్య యంతో నిర్మాణం చేయడం విశేషం.
రక్షణ రంగంలో ఈ జిల్లాకి ఉన్న అనుకూల పరిస్థితుల దృష్ట్యా కేంద్రం ఇస్తున్న ప్రాధా న్యం ఎనలేనిదని చెప్పక తప్పదు. డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్ (డీఆర్డీవో) ఆధ్వర్వంలో ఉండే ఈ కేంద్రం స్వల్ప-శ్రేణి, దీర్ఘ-శ్రేణి క్షిపణులకు మద్దతు ఇస్తుంది. దీనికి లాం కంట్రోల్ సెంటర్, లాం ప్యాడ్‌లు, బ్లాక్‌హౌస్, కమ్యూనికేషన్ నెట్‌వర్క్ ఉండటంతో పాటు టెలిమెట్రీ, ఎలక్ట్రో-ఆప్టికల్ ట్రాకింగ్ కోసం శాశ్వత పర్యవేక్షణ స్టేషన్లను కూడా ఇది కలిగి ఉంటుంది.
బాలాసోర్‌పై ఒత్తిడి తగ్గించేందుకే..
తూర్పు తీరంలోని ఒడిశా రాష్ర్టంలో ఉన్న క్షిపణి పరీక్ష కేంద్రం బాలాసోర్‌పై పడుతున్న ఒత్తిడి తగ్గించేందుకు మరొక అనువైన ప్రాంతం కోసం రక్షణ శాఖ అన్వేషించి చివరికి 2011లో కృష్ణా జిల్లా మచిలీపట్నం సమీపంలోని నాగాయలంక మండలం గుల్లలమోద సముద్ర తీర గ్రామాన్ని ఎంపి క చేసింది. క్షిపణి ప్రయోగ కేంద్రం నిర్మాణం కోసం ఈ ప్రాంతంలో 386 ఎకరాల స్థలం అవసరమవగా.. డీఆర్డీవో 2012లో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది.
ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్డీయే ప్ర భుత్వం 2014లో అధికారంలోకి వచ్చిన త ర్వాత ఆనాటి ఏపీ సీఎం చంద్రబాబు నాయు డుతో చర్చలు జరపగా.. ఆయన ఈ కేంద్ర నిర్మాణానికి కావాల్సిన భూమిని ఇచ్చేందు కు అంగీకరించారు. 2017లో కేంద్ర రక్షణ శాఖ అంగీకరించగా ఏటిమొగ రెవెన్యూ గ్రామ పరిధిలోని అభయారణ్యంలో 381.61 ఎకరాలను రాష్ర్ట ప్రభుత్వం డీఆర్డీవోకు కేటాయించింది.
దీనికి బదులుగా గణపేశ్వరం పరిధిలో అంతే రెవెన్యూ భూ మిని అటవీశాఖకు అప్పగిస్తూ, జీవో నెం.1352 జారీ చేశారు. వెంటనే కేంద్ర అట వీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి తొలి దశ అనుమతులు కూడా మంజూరయ్యా యి. 2018లో కోస్టల్ రెగ్యులేటరీ జోన్ (సీఆర్‌జెడ్) నుంచి కూడా అనుమతులు వచ్చాయి. దీని స్థాపక ఆవశ్యకత ఎంతటిదో ఈ విషయాలతోనే తెలుస్తుంది.
2019లో పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి రెండో దశ అనుమతులు కూడా లభించాయి. ఇక 2020 ఆ స్థలాన్ని డీఆర్డీవో స్వాధీ నం చేసుకొని తొలివిడతగా ప్రహరీని, పరిపాలనా భవనాన్ని నిర్మించింది. రాష్ర్టంలో ప్రభుత్వం మారటంతో పనులు నిదానంగా జరుగుతూ.. చివరికి ఏవో కారణాలతో నిలిచిపోయాయి. తర్వాత ఎలాంటి పురోగతీ లేదు.
క్షిపణి కేంద్రానికి వచ్చే శాస్త్రవేత్తలకు, ఇతర ప్రముఖుల కోసం కావాల్సిన అతిథి గృహం, శాస్త్రవేత్తల నివాస సముదాయం కోసం గన్నవరం విమానాశ్రయం సమీపంలో కొంత భూమి కావాలని డీఆర్డీవో ప్రభుత్వానికి లేఖ రాయగా, నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అసలు ఏ మాత్రం పట్టించుకోలేదని చెబుతారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ తీరుతో విసిగి వేసారిన కేంద్రం ఈ క్షిపణి కేంద్రాన్ని గుజరాత్ తీరానికి తరలించాలనే ఆలోచనకు వచ్చింది.
తెలుగు రాష్ట్రా లకి చెందిన డీఆర్డీవో చైైర్మన్ సతీష్ రెడ్డి దీని ఆవశ్యకత తెలిసిన శాస్త్రవేత్తగా.. క్షిపణి కేం ద్రం ఇక్కడే నిర్మించాలని పలుమార్లు గుల్లలమోదని సందర్శించారు. ఈ సందర్భం గానే 2021 జూలైలో గుల్లలమోద వచ్చినప్పుడు త్వరలోనే ఇక్కడే నిర్మాణ పనులు చేపడతామని ప్రకటించారు కూడా. అయినప్పటికీ రాష్ర్ట ప్రభుత్వం పట్టించుకున్న దా ఖలాలు లేవు.
కేంద్ర రక్షణశాఖ శాస్త్ర సలహాదారుగా ఉన్న సతీష్ రెడ్డి క్షిపణి పరీక్ష కేం ద్రం తరలిపోకుండా ప్రయత్నిస్తున్నామని ప్రకటించటంతో అప్పటివరకు గుజరాత్ త రలిపోతుందనుకున్న ఈ కేంద్రం ఆయన సలహా మేరకు గుల్లలమోద వద్ద నిర్మించేందుకు క్యాబినెట్ అంగీకరించింది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోని భద్ర తా వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఎస్) 2024 అక్టోబర్ 24న సమావేశమై ఆంధ్రప్రదేశ్‌లోని నాగాయలంక సమీపంలో ఈ క్షిపణి పరీక్షా శ్రేణిని ఏర్పాటు చేయడానికి ఆమోదం తెలిపింది. ఈ కేంద్రంలో ఆధునిక వ్యూహాత్మక క్షిపణి వ్యవస్థలను పరీక్షించడంపై దృష్టి సారించడం ద్వారా భారతదేశ రక్షణ సామర్థ్యాల పెంపుకు ఈ ప్రాజెక్టు ఎం తో ఆవశ్యకం అని చెప్పాలి.
మైళ్ల దూరంలోని లక్ష్యాలను ఛేదించడం అవసరం
ప్రస్తుత యుద్ధ స్వభావంలో వచ్చిన ఆ ధునిక సాంకేతిక మార్పులతో ట్యాంక్ పోరా టం లాంటి శాస్త్రీయ యుద్ధ రీతులు వెనుకబడుతున్నాయి. పెరిగిన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానంతో వేల మైళ్ల దూరంలోని లక్ష్యాలను కచ్చితమైన రీతిలో ఛేదించగలిగే వ్యవస్థలు అవసరం. ఈ స్థితిలో మరింత ఆధునికీకరించిన పరిజ్ఞానంతో క్షిపణులు కావాలి.
90 శాతం కంటే ఎక్కువ శత్రువులను మట్టుబెట్టే సంభావ్యత కలిగిన గైడెడ్ క్షిపణితో కూడిన అధునాతన వాయు రక్షణ వ్యవస్థ శ్రేణి, పైగా శత్రు క్షిపణుల దాడి నుం చి తమను తాము రక్షించుకోవడంలో మన రక్షణ దళాలకు ఇది ఎంతో సహాయపడుతుంది.
ఈ అవసరం దృష్ట్యా స్వదేశీ క్షిపణి తయారీ కార్యక్రమాల కోసం ఆర్‌ఎఫ్ అం డ్ ఐఐఆర్ సీకర్స్ ఉత్పత్తి, తదుపరి ఇంజనీరింగ్ సాంకేతికతను ఏకకాలంలో గ్రహించ డానికి భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బీఈఎల్), డీఆర్డీవోలు సంయుక్తంగా సీకర్ తరగతికి చెందిన మిస్సుల్స్‌ని ఉత్పత్తి చేసే కార్యక్రమంలో నిమిగ్నం అయ్యాయి.
ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రవేశపెట్టిన ప్రతి ష్ఠాత్మక పథకం ఆత్మనిర్భర్ భారత్ కింద దే శం కోసం భారత ప్రభుత్వం సానుకూల స్వదేశీకరణ జాబితా, విధాన చొరవల నుం చి ఉత్పన్నమయ్యే రాబోయే అవసరాలు, అవకాశాల కోసం ఆర్‌ఎఫ్ అండ్ ఐఐఆర్ పరిశోధన, ఆధునిక తయారీ క్షిపణులను రూపొందించేందుకు బీఈఎల్ ఆర్థిక, సాంకేతిక చేయూతనిస్తోంది.
ఉపరితలం నుంచి గ గనతల క్షిపణుల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ సీ కర్, ఉపరితలం నుంచి ఉపరితల క్షిపణుల కోసం రేడియో ఫ్రీక్వెన్సీ (ఆర్‌ఎఫ్) సీకర్, యాంటీ-ట్యాంక్ గైడెడ్ క్షిపణుల కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ (ఐఐఆర్) సీకర్స్ చాలా తక్కువ దూరపు క్షిపణుల కోసం ఇమేజింగ్ ఇన్‌ఫ్రారెడ్ సీకర్స్ సాంకేతిక పరిజ్ఞానం కలిగిన క్షిపణులు నేడు మన రక్షణ రంగానికి ఎంతో అవసరం.
ఇందులో భా గంగానే నేటి యుద్ధ స్వభావంలో వచ్చిన ఆధునిక యుద్ధతంత్రాలు, మార్పులు, కచ్చితమైన గురిచూసి లక్ష్యాలని ఛేదించగల్గే క్షిపణుల అవసరం ఎంతో ఉంది. తదనుగణంగా మన రక్షణ శాఖ కూడా ఆయు ధాలు, క్షిపణుల్లో సీకర్ల వాడకాన్ని వేగవంతం చేస్తోంది.
దుర్భేద్యంగా రక్షణ రంగం..
భారత రక్షణ రంగాన్ని దుర్భేద్యమైన, తిరుగులేని రీతిలో తీర్చిదిద్దిన ప్రధాని నే తృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం, మన ర క్షణ రంగాన్ని కనీవినీ ఎరుగని రీతి లో మ రింత పటిష్ట పరిచేందుకు ఎన్నో ఎన్నెన్నో ఆధునిక మార్పులతో కూడిన అభివృద్ధి ప్రాజెక్టులను చేపట్టి ప్రపంచపటంలో మరింత పైపైకి దూసుకెళ్లే ప్రయత్నం చే స్తోంది. దేశంలోని పార్టీలు కూడా ఈ ప్ర యత్నానికి సహకరించాలి. ఎటువంటి రా జకీయాలు చేయకుండా.. తమ ఎజెండాలను పక్కకు పెట్టి ఐక్యంగా ప్రభుత్వానికి మద్దతు తెలిపి చేయూతనివ్వాల్సి వుంది.
వ్యాసకర్త సెల్: 9491545699