calender_icon.png 7 January, 2026 | 4:36 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కవిత పార్టీతో మాకు నష్టమేమీలేదు

06-01-2026 01:18:54 AM

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు

హైరదాబాద్, జనవరి 5 (విజయక్రాంతి): ఎమ్మెల్సీ కవిత పార్టీ పెడితే తమకు వచ్చే ఎలాంటి నష్టం లేదని, ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావు పేర్కొన్నారు. తెలంగాణ జాగృతి రాజకీయ పార్టీగా మారుతుందని కవిత చేసిన వ్యాఖ్యలపై రాంచందర్‌రావు సోమవారం స్పందించారు.

ఎవరైనా పార్టీలు పెట్టుకోవచ్చన్నారు. ఆమె ఆత్మగౌరవం ఎలా దెబ్బతిందో వారి కుటుంబ అంశమన్నారు. కాంగ్రెస్ ప్రభు త్వం వీబీ జీ రామ్ జీను వ్యతిరేకిస్తూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఆయన వ్యతిరే కించారు. ఉపాధి పథకంలో వేల కోట్ల అవినీతి జరిగిందని, పారదర్శకత లేని పథకాలే కాంగ్రెస్ కోరుకుంటుందని విమర్శించారు.