28-12-2025 01:04:29 AM
సంధ్యా థియేటర్
తొక్కిసలాట కేసులో..
మొత్తం 23 మందిపై
ఛార్జిషీట్ దాఖలు
జాబితాలో థియేటర్ ఓనర్లు, ఈవెంట్ ఆర్గనైజర్లు, బౌన్సర్లు
ఇప్పటికే 14 మంది అరెస్ట్.. ముందస్తు బెయిల్‌పై
మరో 9 మంది
హైదరాబాద్ సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ బ్యూరో, డిసెంబర్ 27 (విజయక్రాంతి): హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లో ఉన్న సంధ్యా థియేటర్ వద్ద జరి గిన తొక్కిసలాట ఘటనలో హైదరాబాద్ పోలీసులు దర్యాప్తు పూర్తి చేశారు. ఈ కేసు లో మొత్తం 23 మందిని నిందితులుగా చేరు స్తూ శనివారం కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ ఛార్జిషీట్‌లో సినీ నటుడు అల్లు అర్జున్‌ను 11వ నిందితుడిగా పేర్కొనడం గమనార్హం. ఈ విషయాన్ని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ధృవీకరించారు. డిసెంబర్ 24న న్యాయస్థానంలో ఛార్జిషీట్ దాఖలు చేసినట్లు ఆయన తెలిపారు.
సంధ్యా థియేటర్ వద్ద జరిగిన ఘటనకు.. థియేటర్ యాజమాన్యం, ఈవెంట్ నిర్వాహకులు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బంది మధ్య సరైన సమన్వయం లేకపోవడమే ప్రధాన కారణమని దర్యాప్తులో తేలింది. భారీగా జనం తరలివచ్చినప్పుడు తీసుకోవాల్సిన క్రౌడ్ మేనేజ్‌మెంట్ చర్యలు, ప్లానింగ్, భద్రతా ఏర్పాట్లలో తీవ్రమైన లోపాలు ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. థియేటర్ భాగస్వాములైన అగమతి రామ్‌రెడ్డి ఏ1 మొదలు కొని బౌన్సర్ల వరకు అందరినీ నిందితులుగా చేర్చారు.
థియేటర్ యాజమాన్యం అగమతి రామ్‌రెడ్డి, సందీప్, సుమీత్, వినయ్ కుమా ర్ తదితరులు ఏ1 నుంచి ఏ9 వరకు, నటు డు అల్లు అర్జున్ ఏ11, ఆయన మేనేజర్లు జోస్యుభట్ల సంతోష్ కుమార్ ఏ12, శరత్ బన్నీ ఏ13, ఫ్యాన్స్ అసోసియేషన్ ఇన్‌చార్జ్ తాటిపాముల వినయ్ కుమార్ ఏ14, ఈవెం ట్ ఆర్గనైజర్ కిరణ్ కుమార్ గౌడ్ ఏ16, హీరో వ్యక్తిగత భద్రతా సిబ్బంది, బౌన్సర్లు ఏ17 నుంచి ఏ23 వరకు ఉన్నారు. మొత్తం 23 మంది నిందితుల్లో 14 మందిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేశారు. అల్లు అర్జున్ సహా మరో 9 మంది ముందస్తు బెయిల్ పొందడంతో వారికి నోటీసులు జారీ చేసినట్లు సీపీ సజ్జనార్ తెలిపారు. చట్ట ప్రకారం తదుపరి చర్యలు ఉంటాయని ఆయన స్పష్టం చేశారు.