28-12-2025 01:17:43 AM
వీరికి మాత్రమే అమలుకాని నిబంధనలు
విద్యా..ఆర్థిక శాఖల చుట్టూ ఫైళ్ల చక్కర్లు
హైదరాబాద్, డిసెంబర్ 27 (విజయక్రాంతి): మోడల్ స్కూల్ ఉపాధ్యాయులపై రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోని ఉద్యోగులందరికీ ఒకలా.. మోడల్ స్కూళ్లలో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు మాత్రం మరోలా నిబంధనలను అమలు చేస్తోంది.
మోడల్ స్కూళ్లోని ఉపాధ్యాయు డు చనిపోయినప్పుడు రెగ్యులర్ ఉద్యో గుల్లాగే వీరికి కూడా డెత్ గ్రాట్యూటీతోపా టు కుటుంబానికి ఫ్యామిలీ పెన్షన్ ప్రయోజనాలు అమలు చేయాల్సి ఉం టుంది. కానీ ఇంత వరకూ వాటిని అమలు చేయకుండా, వీటిపై నిర్ణయం తీసుకోకుండా ప్ర భుత్వం తాత్సారం చేస్తోంది. దీంతో ఉపాధ్యాయులు, బాధిత కు టుంబాలు తీవ్ర మనోవేదనకు గుర వుతున్నాయి.
వీరికే ఎందుకు ఇలా?
రాష్ట్రంలో మొత్తం 194 మోడల్ స్కూళ్లు ఉన్నాయి. వీటిలో దాదాపు 3 వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు. వీరంతా 2013లో ని యామకమైనవారే. అయితే 2004 నియామకాలు పొందిన ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం) పరిధిలోకి వస్తారు. అంటే మోడల్ స్కూల్ ఉపాధ్యాయులు కూడా దీని పరిధిలోనే ఉన్నారు. జీవో నెం.58, జీవో నెం.60 ప్రకారం ప్రతి సీపీఎస్ ఉద్యోగికి డెత్ గ్రాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్ వర్తించాలి.
సీపీఎస్ కోసం ప్రతినెలా మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల వేతనాల నుంచి 10 శాతం కోత విధిస్తున్నారు. దీనికితోడూ ప్రభుత్వం కూడా తన వాటాగా 10 శాతం మ్యాచింగ్ గ్రాంట్‌గా అందజేస్తోంది. కానీ మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల విషయంలో మా త్రం ప్రభుత్వం వివక్ష చూపుతోంది. రాష్ట్రంలోని సీపీఎస్ ఉద్యోగులకు వర్తించే డెత్ గ్రాట్యూటీని మాత్రం అమలు చేయడంలో జాప్యం చేస్తోంది.
గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం లో ప్రతిపాదనలు సిద్ధం చేసి ఆర్థిక శాఖకు ఫైల్‌ను పంపించారు. మూడు సంవత్సరాల నుంచి నేటికీ ఆ దస్త్రం విద్యాశాఖ నుంచి ఆర్థిక శాఖకు, ఆర్థిక శాఖ నుంచి విద్యాశాఖకు భూభ్రమణంలా చక్కర్లు కొడతున్నా ప్రభుత్వ ఆమోదం మాత్రం లభించడంలేదని, వివిధ కారణాలతో వెనక్కి వస్తూనే ఉం దని ఉపాధ్యాయులు వాపోతున్నారు. తాజా గా ఆర్థిక శాఖ.. పాఠశాల విద్యాశాఖకు పలు అంశాలపై వివరణ కోరుతూ ఫైల్‌ను పంపించింది. సమాధానాలను సిద్ధం చేసి త్వరలోనే మళ్లీ విద్యాశాఖ ప్రభుత్వానికి పంపనుంది.
40 బాధిత కుటుంబాలకు అందని ప్రయోజనాలు
2013 నుంచి ఇప్పటి వరకు దాదాపు 40 మంది ఉపాధ్యాయులు మరణించగా, నలుగురు ఉద్యోగ విరమణ పొందారు. ఇక్కడ దురదృష్టకరమైన విషయం ఏమిటంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు మరణించిన ఉపాధ్యాయుల కుటుంబసభ్యులకు ఎలాంటి ప్రయోజనాలు కూడా అందని పరిస్థితి. ఒకవైపు కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి..రెండోవైపు వారికి దక్కాల్సిన ప్రయోజనాలు దక్కకపోవడంతో ఆ కుటుంబాలు తీవ్రమైన ఆర్థిక, మానసిక దుర్భర పరిస్థితుల్లో జీవిస్తున్నాయి. ఓ ఉపాధ్యాయుడు జూన్ 2013లో ఉద్యోగంలో చేరారు.
తన బేసిక్ పే రూ.74,840 కాగా, అతను సెప్టెంబర్ 2023లో చనిపోయారు. తాను సర్వీస్ చేసిన కాలం పదేళ్లు. అయితే అతని కుటుంబానికి డెత్ గ్రాట్యూటీ రూ.8,75,826తోపాటు, ఫ్యామిలీ పెన్షన్ నెలకు రూ.37,420 రావాల్సి ఉంటుంది. మరోక ఉపాధ్యాయుడు జూలై 2013లో ఉద్యోగంలో చేరి సెప్టెంబర్ 2024లో చనిపోయారు. అయితే అతని కుటుంబానికి డెత్ గ్రాట్యూటీ రూ.7,87,590తోపాటు పెన్షన్ నెలకు రూ.33,650 రావాల్సి ఉంటుంది. కానీ ఇంత వరకూ ఇది అమలు కావడంలేదు.
ఇది తీవ్రమైన అన్యాయం
జీవోల్లో స్పష్టంగా ఉన్నప్పటికీ దాన్ని అమలు చేయకపోవడం తీవ్ర అన్యాయం. మరణించిన ఉపాధ్యాయుల కుటుంబాలకు వెంటనే న్యాయం చేయాలి. బాధిత కుటుంబాలు ఆర్థికంగా, మానసికంగా చితికిపోతున్నాయి. కేవలం మోడల్ స్కూల్ ఉపాధ్యాయుల విషయంలోనే ప్రభుత్వం వివక్ష చూపు తోంది. తక్షణమే డెత్ గ్యాట్యూటీ, ఫ్యామిలీ పెన్షన్, కారుణ్య నియామకాలు కూడా అమలు చేయాలి.
భూతం యాకమల్లు, తెలంగాణ మోడల్ స్కూల్స్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు