28-11-2025 12:40:01 AM
వరుసగా మూడు ఘన విజయాలతో ప్రేక్షక హృదయాల్లో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న స్టార్ హీరో నవీన్ పొలిశెట్టి 2026 సంక్రాంతికి ‘అనగనగా ఒక రాజు’తో అలరించనున్నారు. ఈ చిత్రాన్ని సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్నారు. నూతన దర్శకుడు మారి దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి కానుకగా 2026, జనవరి 14న విడుదల కానుంది. తాజాగా ఈ సినిమా నుంచి తొలిగీతం ‘భీమవరం బల్మా’ విడుదలైంది. నవీన్ పొలిశెట్టి తొలిసారి పాడిన గీతమిది.
కథానాయిక మీనాక్షి చౌదరితో కలిసి ఈ పాటలో ఆయన చేసిన డ్యాన్స్ కట్టిపడేసింది. ‘చాట్ జీపీటీ.. ఎవరే ఈ బ్యూటీ.. ఎంతందంగుంటి హాయ్.. డ్రెస్సులు ఒక్కోటి.. వెల కడితే కోటి.. యే కిస్ కీ బేటీ హై భాయ్..’ అంటూ సాగుతోందీ పాట. మిక్కీ జే మేయర్ స్వరాలు సమకూర్చిన ఈ పాటకు చంద్రబోస్ సాహిత్యం అందించగా నవీన్ పొలిశెట్టి, నూతన మోహన్ ఆలపించారు. ఈ చిత్రానికి సంగీతం: మిక్కీ జే మేయర్; ఛాయాగ్రహణం: జే యువరాజ్.