calender_icon.png 28 November, 2025 | 3:14 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మరువ తరమా జనం మెచ్చే చిత్రమవుతుంది

28-11-2025 12:41:36 AM

హరీశ్ ధనుంజయ, అతుల్య చంద్ర, అవంతిక హరి నల్వా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘మరువ తరమా’. ఈ సినిమాకు చైతన్యవర్మ నడింపల్లి దర్శకత్వం వహించారు. రమణమూర్తి గిడుతూరి, రుద్రరాజు ఎన్‌వీ విజయ్‌కుమార్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా నవంబర్ 28న విడుదల కానుంది. ఈ క్రమంలో మేకర్స్ మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణరాజు, హీరోలు నారా రోహిత్, శ్రీవిష్ణు ముఖ్యఅతిథులుగా విచ్చేశారు.

రఘురామ కృష్ణరాజు మాట్లాడుతూ.. “మరువ తరమా’ కథ ప్రస్తుత ట్రెండ్‌కు తగ్గట్టుగా ఉంది. ఇది జనం మెచ్చే చిత్రం అవుతుంది” అన్నారు. నారా రోహిత్ మాట్లాడుతూ.. “మంచి సినిమా వచ్చినప్పుడల్లా ప్రేక్షకులు ప్రోత్సహిస్తుంటారు. ఈ సినిమానూ ఆదరిస్తారని ఆశిస్తున్నా” అని చెప్పారు. ‘డబ్బు కంటే పేరు కోసం ప్రయత్నిస్తున్న వారందరికీ తెలుగు ప్రేక్షకులు సహకారం ఎప్పుడూ ఉంటుంద’ని శ్రీవిష్ణు అన్నారు.

హరీశ్ ధనుంజయ్ మాట్లాడుతూ.. ‘చైతన్య తన స్నేహితుడికి జరిగిన రియల్ స్టోరీనే ‘మరువ తరమా’గా మార్చాడు. యువత బాగా కనెక్ట్ అవుతారు. చైతన్య మంచి లిరిసిస్ట్.. సినిమా అంతా పొయెట్రీ కనిపిస్తుంది” అన్నారు. డైరెక్టర్ చైతన్యవర్మ మాట్లాడుతూ.. “మరువ తరమా’ జర్నీలో ఎంతో నేర్చు కున్నా. డబ్బు కోసమే సినిమాలు చే యం. నిజాయితీగా ప్రయత్నం చేశాం” అన్నారు. నిర్మాత రమణమూర్తి, నటీమణులు అవంతిక, రోహిణి, కెమెరామెన్ రుద్రసాయి, చిత్రబృందం పాల్గొన్నారు.