calender_icon.png 5 November, 2025 | 1:12 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కల్లుగీత కార్మిక సంఘం మండల ఉపాధ్యక్షులుగా సంతోష్ గౌడ్

04-11-2025 09:51:54 PM

జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): కల్లుగీత కార్మిక సంఘం జాజిరెడ్డిగూడెం మండల నూతన ఉపాధ్యక్షులుగా మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామానికి చెందిన చామకూరి సంతోష్ గౌడ్ ను ఆ సంఘం జిల్లా కార్యదర్శి మడ్డి అంజిబాబు ఆధ్వర్యంలో ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. మంగళవారం మండల కేంద్రం అర్వపల్లిలో ఆసంఘం సమావేశం నిర్వహించారు

ఈ సందర్భంగా నూతన కమిటీని ఎన్నుకున్నారు. నూతన అధ్యక్షులుగా పొలిశెట్టి సైదులు గౌడ్, ప్రధాన కార్యదర్శిగా శిగ వెంకన్నగౌడ్, గౌరవ అధ్యక్షుడిగా ఖమ్మంపాటి సాంబయ్య గౌడ్ లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అనంతరం నూతన ఉపాధ్యక్షుడు సంతోష్ గౌడ్ మాట్లాడుతూ గీత కార్మికుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. తనపై నమ్మకంతో బాధ్యతలు అప్పగించిన రాష్ట్ర, జిల్లా నాయకత్వానికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.