08-07-2025 06:28:13 PM
పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి ప్రతి ఒక్కరికి యువజన కాంగ్రెస్ మూల స్తంభం లాంటిదని ఉమ్మడి నల్గొండ జిల్లా యువజన కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు, మాజీ జెడ్పిటిసి, నల్లగొండ పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి(Congress Party President Gummula Mohan Reddy) అన్నారు. మంగళవారం నల్గొండలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో యువజన కాంగ్రెస్ నల్గొండ నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్ ఆధ్వర్యంలో మొదటి విస్తృతస్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. యువజన కాంగ్రెస్లో కష్టపడి పని చేస్తే మంచి గుర్తింపు లభిస్తుందని, ఆ తర్వాత మనకు పదవులు వస్తాయని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీలో ఎదగడానికి యువజన కాంగ్రెస్ పార్టీ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. యువజన కాంగ్రెస్ జిల్లా అధ్యక్షుడు మేకల ప్రమోద్ రెడ్డి మాట్లాడుతూ... జిల్లాలో యువజన కాంగ్రెస్ ను మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలంతా చిత్తశుద్ధితో పనిచేయాలని కోరారు. యువజన కాంగ్రెస్ కార్యకర్తలు ఏ కార్యక్రమం చేపట్టిన ఐవైసీ ద్వారా అప్లోడ్ చేయాలని సూచించారు. అప్పుడే మీరు చేసిన పనికి, మీకు గుర్తింపు లభిస్తుందని అన్నారు. ఈ సమావేశంలో యువజన కాంగ్రెస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు హరిప్రసాద్, శ్రీకాంత్, నియోజకవర్గ అధ్యక్షుడు మామిడి కార్తీక్, జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ జాంగిర్ బాబా, పట్టణ అధ్యక్షుడు గాలి నాగరాజు, నల్గొండ మండల అధ్యక్షుడు కె.వి.ఆర్ సతీష్, కనగల్ మండల అధ్యక్షుడు పవన్, నాగరాజు, కొప్పు నవీన్ తదితరులు పాల్గొన్నారు.