calender_icon.png 9 July, 2025 | 1:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయంలో వనమహోత్సవం

08-07-2025 06:23:37 PM

మహదేవపూర్/భూపాలపల్లి (విజయక్రాంతి): జయశంకర్ భూపాలపల్లి జిల్లా(Jayashankar Bhupalpally District) మహదేవపూర్ మండలం శ్రీ కాలేశ్వరం ముక్తేశ్వర స్వామి ఆలయంలో మంగళవారం వన మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర స్వామి దేవస్థానం కాళేశ్వరం యొక్క అనుబంధ ఆలయమైన శ్రీ ఆది ముక్తీశ్వర స్వామి దేవాలయం వద్ద మామిడి, మారేడు 200  మొక్కలు పెట్టారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్య నిర్వహణాధికారి ఎస్. మహేష్, సూపరింటెండెంట్ శ్రీనివాస్, ఆలయ సిబ్బంది అర్చకులు పాల్గొన్నారు.