calender_icon.png 8 July, 2025 | 9:08 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఘనంగా వైఎస్సార్ జయంతి

08-07-2025 06:12:49 PM

మునగాల: దివంగత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి డాక్టర్ యెడుగూరి సందింటి రాజశేఖర్ రెడ్డి 76వ జన్మదిన వేడుకలను మునగాల గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కొమ్ము ఈదారావ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా పాల్గొన్న మండల అధ్యక్షులు కొప్పుల జైపాల్ రెడ్డి ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... 33 సంవత్సరాలకే టీపీసీసీ ప్రెసిడెంట్, పోటీ చేసిన ఏ ఎన్నికల్లో ఓడిపోలేదని ఆరుసార్లు ఎమ్మెల్యే, నాలుగు సార్లు ఎంపీ, మూడుసార్లు మంత్రి, రెండుసార్లు ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి రాజశేఖరుదని, ప్రజలందరికీ వైద్యం అందాలని ఆరోగ్యశ్రీ స్థాపించిన మహనీయుడు రాజశేఖర్ రెడ్డి అని, ప్రాణాపాయ స్థితిలో ఉన్న వారిని కాపాడడానికి 108ను ప్రారంభించిన మహాత్ముడు రాజశేఖర్ రెడ్డి అని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో కోదాడ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కాసర్ల కోటేశ్వరరావు, కాంగ్రెస్ పార్టీ నాయకులు భీమ్పంగు శంకర్, చింతకాయల నాగరాజు, శెట్టి గిరి, మైనార్టీ నాయకులు ఎండి రషీర్, మండవ శ్రీను, గుండు నాగేశ్వరరావు, గంధం సైదులు, నాగరాజు, నరేష్, కాసర్ల వెంకట్ పాల్గొన్నారు.