08-07-2025 06:15:35 PM
మునగాల: ఎవరైనా గంజాయిని తాగినా, విక్రయించినా వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని మునగాల మండల ఎస్సై ప్రవీణ్ కుమార్(Mandal SI Praveen Kumar) హెచ్చరించారు. మంగళవారం ఒక పత్రిక ప్రకటనలో ఆయన మాట్లాడుతూ.. గంజాయిని తాగి తమ భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని, గంజాయి వంటి మాదకద్రవ్యాల బారిన పడితే నేరాలు చేస్తారని వాటి నియంత్రణకు పోలీసులకు సహకరించాలన్నారు. గంజాయి మత్తులో పడి జీవితాలను నాశనం చేసుకోవద్దని అన్నారు.
పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు. పాశ్చాత్య దేశాల సంస్కృతి మన దేశంలో విచ్చలవిడిగా సాంకేతిక రంగం ద్వారా వారి దురాలవాట్లను మనకు రుద్దే ప్రయత్నం చేస్తున్నారని మంచిని తీసుకుని చెడును వదిలేయాలని సూచించారు. యువత చదువు, క్రీడలు తప్పా ఇంకో ఆలోచన దరికి చేర నీయొద్దన్నారు. యువత గంజాయి మత్తులో జీవితాలు నాశనం చేసుకుని కుటుంబాలకు శోకం మిగిల్చవద్దని సూచించారు.