21-11-2025 11:49:15 PM
రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్ జీడి వీరస్వామి
జాజిరెడ్డిగూడెం(అర్వపల్లి): మండల పరిధిలోని తిమ్మాపురం గ్రామంలో నివాస గృహాలపై ప్రమాదకరంగా ఉన్న విద్యుత్ తీగలను వెంటనే తొలగించాలని రాజ్యాంగ పరిరక్షణ సమితి మండల కోఆర్డినేటర్, తిమ్మాపురం గ్రామ మాజీ సర్పంచ్ జీడి వీరస్వామి విద్యుత్ ఎస్ఈ ఫ్రాంక్లిన్ కు తన కార్యాలయంలో శుక్రవారం వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... గత కొన్ని సంవత్సరాలుగా గ్రామంలో విద్యుత్ తీగలు ఇండ్లపై నుండి ప్రమాదకరంగా ఉన్నాయని వాటిని వెంటనే తొలగించాలని కోరారు.ఈ విషయమై తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేలుకు తెలపగా సమస్యను వెంటనే పరిష్కరించాలని ఎస్ఈ కి ఆదేశాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు సిద్ధి రాము,జీడి వెంకన్న తదితరులు ఉన్నారు.