21-11-2025 11:55:23 PM
ఎన్టీఆర్ ఆశయాలను సాధించాలి
ఎన్టీఆర్ విగ్రహ ఏర్పాటుకు భూమి పూజ
గరిడేపల్లి,(విజయక్రాంతి): పటేల్ పట్వారి వ్యవస్థను రద్దుచేసి ప్రజలకు స్వేచ్ఛ సమానత్వం తెచ్చిన గొప్ప నాయకుడని, ఆయన ఆశయ సాధన కొరకు ప్రతి ఒక్కరు పనిచేయాలని టిడిపి హుజూర్నగర్ నియోజకవర్గం ఇంచార్జ్ మండవ వెంకటేశ్వర్లు గౌడ్ పిలుపునిచ్చారు. శుక్రవారం గరిడేపల్లి మండలం తాళ్ల మల్కాపురం గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం ఏర్పాటుకు భూమి పూజ చేసిన సందర్భంగా ఆయన మాట్లాడారు.
ఎన్టీఆర్ తెలుగుదేశం హయాంలో తెలంగాణ ప్రాంతం అభివృద్ధిలో దూసుకుపోయిందని ఈ ప్రాంతంలో ఉన్న మహిళలకు ఆస్తిలో సమాన హక్కు, మండల వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రభుత్వ వ్యవస్థలన్నింటిని ప్రజల చెంతకు చేర్చిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. రెండు రూపాయలకే కిలో బియ్యం అందించి పేదల దేవుడిగా ఎన్టీఆర్ ప్రజల గుండెల్లో నిలిచిపోయారని తెలిపారు.