15-12-2025 05:05:40 PM
కాంగ్రెస్ అభ్యర్థి గొండ అనిత..
గొడవకు కారణం ఎమ్మెల్యే అనుచరులే..
కొల్చారం (విజయక్రాంతి): రంగంపేటలో ఉద్రిక్తతకు కారణం ఎమ్మెల్యే అనుచరులే అని కాంగ్రెస్ పార్టీ బలపరిచిన రంగంపేట సర్పంచ్ అభ్యర్థి గొండ అనిత, మాజీ సర్పంచ్ బండి సుజాత రమేష్ లు అన్నారు. గ్రామ పంచాయతీ ముందు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆటపాటలతో పక్కన ఎన్నికల ప్రచారం నిర్వహిస్తుండగా సునీత రెడ్డి కాన్వాయ్ వెళ్లేందుకు పక్కన రోడ్డు ఉన్నప్పటికీ ఎమ్మెల్యే అనుచరులు, ఎమ్మెల్యే గన్‌మెన్లు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను మహిళలను నెట్టివేయడంతో గొడవ జరిగిందన్నారు. గొడవకు ఎమ్మెల్యే గన్‌మెన్లు ఆమె అనుచరులే కారణమని వారు ఆరోపించారు.